Home » తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీలు…!

తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీలు…!

by Bunty
Ad

సినిమా ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు చాలా కామన్. కొంతమంది సెలబ్రిటీలు వారితో నటించిన తోటి నటీనటులనే ప్రేమించి వివాహాలు చేసుకుంటారు. కొంతమంది కుటుంబ సభ్యులను ఒప్పించి అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న సెలబ్రిటీలు ఉన్నారు. ఇక మరికొందరేమో ఇంట్లో వారికి చెప్పకుండా సీక్రెట్ గా వివాహం చేసుకున్న సెలబ్రిటీలు కూడా ఉన్నారు. అయితే వీరు సీక్రెట్ గా వివాహం చేసుకోవడానికి కారణం వారి కుటుంబ సభ్యులు వారి ప్రేమను అంగీకరించకపోవడం. దీంతో వారు ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో సీక్రెట్ గా వివాహం చేసుకున్నారు. అయితే ఆ సెలబ్రిటీలు ఎవరో ఇప్పుడు చూద్దాం.

Advertisement

# మహేష్ బాబు – నమ్రత

స్టార్ హీరో మహేష్ బాబు, నమ్రత ఇద్దరూ కలిసి ఒక సినిమాలో నటించారు. ఆ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో వివాహం చేసుకోవాలని ఈ కుటుంబ సభ్యులకి విషయాన్ని చెప్పారు. కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో వీరు ముంబైలో వివాహం చేసుకున్నారు.

# సూర్య – జ్యోతిక

హీరో సూర్య జ్యోతికని ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్లుగా కొనసాగారు. వీరిద్దరూ ప్రేమించుకుని వారి ప్రేమ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో సూర్య తండ్రి వివాహాన్ని ఒప్పుకోలేదట. దీంతో వీరిద్దరూ సీక్రెట్ గా వివాహం చేసుకున్నారు. దాంతో చేసేదేమీలేక కుటుంబ సభ్యులు మళ్ళీ వీరి వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు.

Advertisement

# దేవయాని – రాజకుమార్

హీరోయిన్ దేవయాని డైరెక్టర్ రాజశేఖర్ ని వివాహం చేసుకుంటానని తన కుటుంబ సభ్యులతో చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో వీరిద్దరూ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వివాహం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం చాలా ఆనందంగా వీరు జీవితాన్ని గడుపుతున్నారు.

# అక్కినేని నాగార్జున – అమల

నాగార్జున అమల ఒక సినిమా సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. నాగార్జున అక్కినేని నాగేశ్వరరావుతో అమలను వివాహం చేసుకుంటానని చెప్పడంతో వీరి వివాహాన్ని అతను ఒప్పుకోలేదు. దీంతో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. వివాహమైన నాగేశ్వరరావు అమలని కోడలుగా ఇష్టపడలేదట. ఇక అఖిల్ పుట్టిన అనంతరం తనని కోడలుగా యాక్సెప్ట్ చేశాడట.

ఇవి కూడా చదవండి 

Chiranjeevi : భోళా శంకర్ సినిమాకు ఎన్ని కోట్ల నష్టం ఎంతో తెలుసా…?

వరల్డ్ కప్ 2023లో కీపర్ ఎవరు..సంజూకు నిరాశ తప్పదా ?

Mr Pregnant Review : మిస్టర్ ప్రెగ్నెంట్ రివ్యూ..హిట్‌ కొట్టినట్టేనా ?

Visitors Are Also Reading