Home » విడాకుల త‌ర‌వాత మ‌ళ్లీ పెళ్లి జోలికి వెళ్ల‌కుండా సింగిల్ గా ఉంటున్న 8 మంది టాలీవుడ్ స్టార్స్ వీళ్లే..!

విడాకుల త‌ర‌వాత మ‌ళ్లీ పెళ్లి జోలికి వెళ్ల‌కుండా సింగిల్ గా ఉంటున్న 8 మంది టాలీవుడ్ స్టార్స్ వీళ్లే..!

by AJAY
Ad

విదేశాల్లో అయితే పెళ్లి చేసుకోవ‌డం విడాకులు తీసుకోవ‌డం చాలా కామ‌న్. ఏడాదికి ఒక‌రిని పెళ్లి చేసుకునేవాళ్లు కూడా అక్క‌డ క‌నిపిస్తారు. అంతే కాకుండా వ‌య‌సుల‌తో సంబంధాలు లేకుండా పెళ్లిళ్లు చేసుకుంటారు. ఇప్పుడు అలాంటి క‌ల్చ‌ర్ మ‌న‌దేశంలోనూ పెరిగిపోయింది. పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంటున్న‌వాల్లు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా సినిమా తార‌లే ఆ లిస్ట్ లో ఎక్కువ‌గా క‌నిపిస్తున్నారు. అంతే కాకుండా పెళ్లి విడాకుల త‌ర‌వాత టాలీవుడ్ లో ఎనిమిది మంది స్టార్స్ మ‌ళ్లీ పెళ్లి వ‌ద్దు బాబోయ్ అంటూ సింగిల్ లైఫ్ ను గ‌డుపుతున్నారు.


Also Read:  ఈ పొరపాట్లు చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో ఉండదు.. ఏంటంటే..!!

Advertisement

siddarth

siddarth

ఆ స్టార్స్ ఎవ‌రో ఇప్పుడు చూద్దాం..టాలీవుడ్ ల‌వ‌ర్ బాయ్ సిద్దార్థ్ 2003లో మేఘ‌న‌ను వివాహం చేసుకున్నాడు. 2007లో వీరిద్ద‌రూ విడిపోయారు. ఆ త‌ర‌వాత సిద్దార్థ్ ల‌వ్ ఎఫైర్ లు న‌డిపిస్తున్నాడుగానీ పెళ్లి జోలికి వెళ్ల‌డం లేదు.

హీరో సుమంత్ హీరోయిన్ కీర్తిరెడ్డిని 2004లో వివాహం చేసుకున్నాడు. వీరిద్ద‌రూ 2006 లో విడాకులు తీసుకున్నారు. అప్ప‌టి నుండి సుమంత్ సింగిల్ గానే ఉంటున్నాడు.

Advertisement

హీరో మ‌నోజ్ త‌న స్నేహితురాలు ప్ర‌ణిత రెడ్డిని 2015లో పెళ్లిచేసుకున్నాడు. వీరిద్దరూ 2019లో విడాకులు తీసుకున్నారు. అప్ప‌టి నుండి మ‌నోజ్ సింగిల్ గానే ఉంటున్నాడు.

kamalhasan gouthami

kamalhasan gouthami

విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ వాణిగ‌ణ‌ప‌తి, సారిక‌ల‌తో విడాకుల త‌ర‌వాత గౌత‌మితో స‌హ‌జీవనం చేశాడు. 2016లో గౌతమితో కూడా విడిపోయి ప్ర‌స్తుతం సింగిల్ గా ఉంటున్నాడు.

హీరోయిన్ రేణూదేశాయ్ ప‌వ‌న్ క‌ల్యాణ్ తో ఐదేళ్లు స‌హ‌జీవ‌నం చేశారు. ఆ స‌మ‌యంలోనే అకీరాకు జ‌న్మ‌నిచ్చారు. 2009లో అకీరా పుట్టిన త‌ర‌వాత ప‌వ‌న్ రేణూ దేశాయ్ పెళ్లి చేసుకున్నారు. కానీ 2010లోనే ఇద్ద‌రూ విడాకులు తీసుకున్నారు. ఆ త‌ర‌వాత రేణూ దేశాయ్ సింగిల్ గా ఉంటున్నారు.

న‌టి రోహిణి 1996లో న‌టుడు ర‌ఘువ‌రుణ్ ను పెళ్లి చేసుకున్నారు. వీరిద్ద‌రూ 2004లో విడాకులు తీసుకున్నారు. ఆ త‌ర‌వాత రోహిణి సింగిల్ గానే ఉండిపోయారు. ఒక‌ప్ప‌టి హీరోయిన్ రేవ‌తి 1986లో న‌టుడు సురేష్ చంద్ర‌మీన‌న్ ను పెళ్లి చేసుకున్నారు. 2003లో వీరు విడాకులు తీసుకున్నారు. ఆ త‌రవాత రేవతి సింగిల్ లైఫ్ ను గడుపుతున్నారు.
Also Read: హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ జీవితంలో ఇంత విషాదం ఉందా…? అనారోగ్యంతో తండ్రి ఇద్దరు అన్నలు అలా..!

Visitors Are Also Reading