టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది టాప్ హీరోలు ఉన్నారు. పాన్ ఇండియా లెవెల్ లో పేరు తెచ్చుకున్నారు. ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వీళ్లంతా కూడా వాళ్ళు ఏంటో ప్రూవ్ చేసుకున్నారు. ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నారు. వీళ్ళలో చాలామంది ఆహారప్రియులు కూడా ఉన్నారు.
ప్రభాస్:
Advertisement
భోజనప్రియుడు ప్రభాస్ ఎక్కువగా నాన్ వెజ్ తింటారు. తోటి నటులకు వంటకాలతో ట్రీట్ ఇస్తూ ఉంటారు. ప్రభాస్ కి ఇష్టమైన ఫుడ్ వచ్చేసి రొయ్యల పులావ్.
ఎన్టీఆర్:
జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే ఈయన కూడా ఎక్కువగా నాన్ వెజ్ తినడానికి ఇష్టపడతారు. చేపల పులుసు అంటే ఈయనకి చాలా ఇష్టమట.
మహేష్ బాబు:
మహేష్ బాబు కూడా నాన్ వెజ్ లవర్. చీటింగ్ డే నాడు తనకు ఇష్టమైన ఫుడ్ తినేస్తూ ఉంటారు. సాధారణ టైంలో అందాన్ని కాపాడుకుంటారు. మహేష్ బాబుకు హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం.
అల్లు అర్జున్:
Advertisement
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫిట్నెస్ ఫ్రీక్. కెరీర్ బిగినింగ్ లో సిక్స్ ప్యాక్ ట్రై చేశారు. అల్లు అర్జున్ కి ఇష్టమైన వంటకం బిర్యాని.
రామ్ చరణ్:
రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా హీరోగా పేరు తెచ్చుకున్నారు. డైట్ వ్యాయామంపై ఎక్కువ ఫోకస్ పెడతారు. రామ్ చరణ్ కి ఫుడ్ బాదం మిల్క్ చాలా ఇష్టం.
బాలయ్య:
బాలయ్య కూడా ఆహార ప్రియుడు. చికెన్ బిర్యాని రొయ్యల వేపుడు అంటే ఆయనకి చాలా ఇష్టం.
చిరంజీవి:
సీ ఫుడ్ ఎక్కువగా ఇష్టపడతారు. చేపలు, రొయ్యలు, పీతలు ఇవన్నీ బాగా తింటారట.
నాగార్జున:
నాగార్జున ఎప్పుడు కూడా క్రమశిక్షణతో ఉంటారు 60 ఏళ్ళు వయసు దాటిన యంగ్ గా కనబడతారు. ఆయనకు హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం.
వెంకటేష్:
వెంకటేష్ కి నాటుకోడి పులావ్ అంటే చాలా ఇష్టమంట. తరచూ ఇవి తింటూ ఉంటారట.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!