మన టాలీవుడ్ ను ఏలుతున్న హీరోలలో గొప్ప గొప్ప చదువులు చదివినవారు ఉన్నారు. చదువును మధ్యలోనే ఆపేసి ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ఫుల్ అయిన హీరోలు కూడా ఉన్నారు. అయితే ఈ హీరోలు ఏం చదువుకున్నారు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం…
# నాగార్జున
నవమన్మధుడుగా పేరు సంపాదించినటువంటి అక్కినేని నాగార్జున ఆటోమొబైల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.
# వెంకటేష్
విక్టరీ వెంకటేష్ చిన్నతనం నుంచే సినిమాలలో నటిస్తూ ఎంబీఏ పూర్తి చేశాడు.
# గోపీచంద్
ఒకప్పుడు అనేక సినిమాలలో విలన్ గా నటించి ప్రస్తుతం టాప్ హీరోగా ఎదిగిన టాలీవుడ్ హీరో గోపీచంద్ ఇంజనీరింగ్ పూర్తిచేశాడు.
# అల్లు అర్జున్
స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ అతి చిన్న వయసు నుంచే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సూపర్ స్టార్ హీరోగా ఎదిగాడు. అయితే అల్లు అర్జున్ డిగ్రీ పూర్తి చేశాడు.
# మహేష్ బాబు
అమ్మాయిల కలల రాకుమారుడు మహేష్ బాబు కూడా డిగ్రీ పూర్తి చేశారు.
# ప్రభాస్
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ బీటెక్ కంప్లీట్ చేశాడు.
# చిరంజీవి
ఇండస్ట్రీని ఏలుతున్నటువంటి మెగాస్టార్ హీరో చిరంజీవి డిగ్రీ చదివారు.
# ఎన్టీఆర్
పాన్ ఇండియన్ స్టార్ హీరోగా పేరు సంపాదించినటువంటి ఎన్టీఆర్ ఇంటర్ వరకే చదివాడు. ఆ తర్వాత సినిమాలపై ఇష్టంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు.
# పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటర్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఈయన సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా రాణిస్తూ బిజీగా ఉన్నారు.
# బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ హైదరాబాద్ లోని నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:
తెలంగాణలో వారందరికీ లక్ష రూపాయలు… ఇలా అప్లై చేసుకోండి
యాంకర్ రష్మీ..ఒక్క షోకు ఎంత తీసుకుంటుందో తెలుసా ?
మనిషి ఎప్పుడు నిద్రలేవాలి.. రాత్రి మెలకువ వస్తే ఎలాంటి సమస్యలు వస్తాయి ?