Home » TODAY TOP 10 NEWS: నేటి ముఖ్య‌మైన వార్తాంశాంలు…!

TODAY TOP 10 NEWS: నేటి ముఖ్య‌మైన వార్తాంశాంలు…!

by AJAY
Ad
INDIA CORONA UPDATE

INDIA CORONA UPDATE

భార‌త్ లో మ‌రోసారి క‌రోనా కేసులు భారీగా పెరిగిపోయాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశంలో కొత్తగా 3,47,254 కరోనా కేసులు న‌మోద‌య్యాయి. 703 మరణాలు నమోదయ్యాయి. మరోవైపు దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 9,692కు చేరుకుంది.

ఘనాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ట్రక్కులో భారీ పేలుడు సంబంవించ‌డంతో 17 మంది మృతి చెందారు. బంగారు గనికి పేలుడు పదార్థాలు తీసుకెళ్తుండగా ట్రక్కును బైక్ ఢీకొట్టడంతో పేలుడు సంబ‌వించింది. పేలుడు దాటికి భవనాలు కుప్ప కూలిపోయాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది.

Advertisement


తెలంగాణలో మరోసారి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగే అవకాశాలు ఉన్న‌ట్టు తెలుస్తోంది. వ్యవసాయ భూముల మార్కెట్ విలువలను 50 శాతం పెంచే ఆలోచనలో తెలంగాణ స‌ర్కార్ ఉన్న‌ట్టు స‌మాచారం. భూముల విలువను 35 శాతం, అపార్టుమెంట్ల విలువను 25 శాతానికి పెంచాల‌ని ప్ర‌భుత్వం ఆలోచ‌న చేస్తోంది.

టీ 20 ప్రపంచకప్-2022 షెడ్యూల్‌ను ఐసీసీ విడుద‌ల చేసింది. ఆస్ట్రేలియాలో ప్ర‌పంచ క‌ప్ పోటీ జ‌ర‌గ‌నుంది. అక్టోబర్ 23న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జ‌ర‌గనుంది. అదే విధంగా న‌వంబర్ 13న మెల్‌బోర్న్ వేదికగా ఫైనల్ జ‌ర‌గ‌నుంది.

Advertisement

నేడు ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జ‌ర‌గ‌నుంది. 32 అంశాలతో కూడిన అజెండాపై కేబినెట్ కీల‌కంగా చ‌ర్చించే అవ‌కాశం ఉంది.

దేశరాజ‌ధాని ఢిల్లీలో వీకెండ్ క‌ర్ఫ్యూను ఎత్తివేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు. పాజిటివ్ కేసులు త‌గ్గ‌డంతో కేజ్రీవాల్ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని గుడివాడలో పోలీసులు భారీగా మోహ‌రించారు. క్యాసినో నిర్వహించిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు టీడీపీ నిజనిర్ధారణ కమిటీ వ‌స్తోన్న నేప‌థ్యంలో ఉద్రిక్త వాతావరణం నెల‌కొంది. టీడీపీ కమిటీలోని మాజీ మంత్రులు నక్కా ఆనంద్‌బాబు, వర్ల రామయ్య, కొల్లు రవీంద్రలు గుడివాడ‌కు బ‌య‌లు దేరారు.

లైబీరియా రాజ‌ధాని మొనోర్వియాలోని ఒక చ‌ర్చిలో విషాదం చోటు చేసుకుంది. తొక్కిస‌లాట జ‌ర‌గ్గా ఈ ఘ‌ట‌న‌లో 29 మంది మ‌ర‌ణించారు. న్యూక్యూటౌన్ లో పెంతెకొస్తల్ చ‌ర్చిలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. దోపిడీ ముఠా చ‌ర్చిలోకి మార‌ణాయుదాల‌తో ప్ర‌వేశించ‌డంతో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

విజ‌య‌వాడ నుండి బెంగుళూరుకు వెళ్లే ప్ర‌యాణీకుల‌కు ఏపీఎస్ ఆర్టీసీ ప్ర‌త్యేక ఆఫ‌ర్ ను ప్ర‌క‌టించింది. టికెట్ ధ‌ర‌పై 20శాతం రాయితీ ఇస్తున్న‌ట్టు ఆర్టీసీ స్ప‌ష్టం చేసింది. అమ‌రావ‌తి వెన్నెల బ‌స్సుల పై ఈ ఆఫ‌ర్ వ‌ర్తిస్తుంది.

 

టీం ఇండియా క్రికెట‌ర్ అక్ష‌ర్ ప‌టేల్ నిశ్చితార్థం అత‌డి ప్రేయ‌సి మేహాతో నిన్న రాత్రి జ‌రిగింది.

 

Visitors Are Also Reading