Home » TODAY TOP 10 NEWS : నేటి ముఖ్య‌మైన వార్తాంశాలు…!

TODAY TOP 10 NEWS : నేటి ముఖ్య‌మైన వార్తాంశాలు…!

by AJAY
Ad
INDIA CORONA UPDATE

INDIA CORONA UPDATE

భార‌త్‌లో కరోనా విజృంభ‌ణ కొన‌సాగుతోంది. దేశంలో మూడు లక్ష‌ల‌కు పైగా రోజువారి క‌రోనా కేసులు న‌మోదయ్యాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 3,13,603 క‌రోనా కేసులు న‌మోదు కాగా 475 మ‌ర‌ణాలు న‌మోదయ్యాయి.

క‌రోనా నియంత్ర‌ణ‌పై నేడు తెలంగాణ మంత్ర‌లు స‌మీక్షా స‌మావేశం ఏర్పాటు చేస్తున్నారు. అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు, అద‌న‌పు క‌లెక్ట‌ర్లు, వైద్య‌శాఖ అధికారుల‌తో స‌మీక్ష జ‌ర‌గ‌నుంది. మంత్రులు హ‌రీష్‌రావు, కేటీఆర్, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ఈ స‌మీక్ష‌ను నిర్వ‌హిస్తారు.

Advertisement

అమెరికాలో 5జీ సేవలు ప్రారంభం అయ్యాయి. ఈ సేవలను టెలికాం దిగ్గజ సంస్థలు ఏటీ అండ్ టీ, వెరిజాన్ లు అందుబాటులోకి తీసుకువ‌చ్చాయి.

అరుణాచల్ ప్రదేశ్‌లో 17 ఏళ్ల బాలుడిని చైనా సైనికులు కిడ్నాప్ చేశారు. మరో బాలుడు చైనా సైనికుల నుండి త‌ప్పించుకున్న‌ట్టు స‌మాచారం.

ఏపీలో ఆర్టీసీ ఉద్యోగులు స‌మ్మెకు దిగేందుకు సిద్దం అవ‌తున్నారు. నేడు ఉద్యోగ సంఘాల సంయుక్త సమావేశం తర్వాత ఉద్యమ కార్యాచరణను ఉద్యోగులు ప్ర‌క‌టించ‌నున్నారు.

Advertisement

తెలుగు అకాడమీ కేసు తరహాలో తెలంగాణ‌లో మ‌రో భారీ మోసం వెలుగులోకి వ‌చ్చింది. తెలంగాణ గిడ్డంగుల శాఖలో రూ.4 కోట్ల నిధులు గల్లంతయ్యాయి. బ్యాంకు అధికారుల పాత్రపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు అంద‌డంతో విచార‌ణ సాగుతోంది.

corona omricon

corona omricon

ద‌క్షిణాఫ్రికా జూలో మూడు సింహాల‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. మ‌నుషుల ద్వారానే క‌రోనా సోకిన‌ట్టు వైద్యులు అనుమానిస్తున్నారు.

Balayya

Balayya akhanda movie review

బాల‌య్య హీరోగా న‌టించిన అఖండ సినిమా అఖండ విజ‌యం సాధించింది. ఈ సినిమా 50రోజులు ఆడి 200 కోట్ల క్ల‌బ్ లో చేరింది.

తమిళనాడు మాజీ ఉన్నత విద్యాశాఖ మంత్రి అన్బాలగన్ ఇంట్లో ఐటీ సోదాలు చేస్తోంది. చెన్నై, సేలం, మధురై సహా 57 ప్రాంతాల్లో ఐటీ శాఖ తనిఖీలు నిర్వ‌హిస్తోంది. తెలంగాణలోని కరీంనగర్‌లో సోదాలు జరిపి అధికారులు భారీగా ఆస్తులు స్వాధీనం చేసుకున్న‌ట్టు స‌మాచారం.

గృహహింస కేసులో కోడలికి కోటి రూపాయల పరిహారం చెల్లించాలంటూ బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ కుటుంబానికి హైకోర్టు ఆదేశాలు జారి చేసింది.

Visitors Are Also Reading