1)భారత్‌లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 2,58,089 కరోనా కేసులు నమొదయ్యాయి. 385 మరణాలు నమోదు అయ్యాయి.
2) కరోనా విజృంభణ నేపథ్యంలో పుట్టపర్తి సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వైద్య సేవలను నిలిపివేశారు. వైద్యం కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే రోగులకు తాత్కాలికంగా వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి.
Advertisement
Advertisement
3)నేడు ప్రపంచ ఆర్థిక సదస్సులో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. దావోస్ సదస్సులో ప్రధాని మోడీ వర్చువల్ స్రసంగం ఉండనుంది. రాత్రి 8:30 గంటలకు స్టేట్ ఆఫ్ ద వరల్డ్ అంశంపై ప్రధాని ప్రసంగిస్తారు.
4) ఏపీలో నైట్ కర్ఫ్యూను అమలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ నేడు కరోనా మరియు వైద్యారోగ్యశాఖ పై సీమీక్షాసమావేశం నిర్వహిస్తున్నారు.
5) హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. తండ్రి మందలించాడని 8వ తరగతి విద్యార్థి 14వ అంతస్థు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
6) తెలంగాణ సీఎల్పీ నేత బట్టి విక్రమార్క కు కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటున్నారు.
7)సంక్రాంతి తరవాత సొంతూళ్లకు వెళ్లిన హైదరాబాద్ ఉద్యోగులు తిరిగి పట్టణానికి పరుగులు తీస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
8) తెలుగు రాష్ట్రాల్లో నేడు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.
9) చిత్తూరు జిల్లా మదనపల్లె వలస పల్లిలో దారుణం చోటు చేసుకుంది. పశువుల పండుగలో పొటేలు ను బలివ్వడానికి సురేష్ అనే వ్యక్తి దాన్ని పట్టుకోగా పొటేలుకు బదులుగా సురేష్ తలపై వేటేయడంతో అక్కడిక్కడే మృతి చెందాడు.
10) బీహార్ లో కల్తీ మద్యం కలకలం రేపింది. ఏకంగా కల్తీ మద్యం కాటుకు పదకొండు మంది మృతి చెందారు.