సాధారణంగా ఇంట్లోకి బొద్దింకలు రావడం సహజం. మనుషుల కంటే పురాతనమైనవి బొద్దింకలు అని చెబుతుంటారు. మానవుని కంటే చాలా ముందు పుట్టాయట. ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచినప్పటికీ ఏదో ఒక రకంగా బొద్దింకలు వస్తూనే ఉంటాయి. వాటిని తేలికగా తీసుకుంటే వాటి సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. అవి ఎంత డేంజర్ అంటే ఆహార పదార్థాలపై బ్యాక్టీరియా వదిలి వెళ్తాయి. తినే పదార్థాలు పాడయ్యేవిధంగా చేస్తాయి. వేగంగా పాకుతూ పిల్లల్ని భయపెడతాయి. ఒకటి ఏంటి బొద్దింకలతో అన్ని సమస్యలే. అడ్డమైన రోగాలు వచ్చేందుకు కారణమయ్యే బొద్దింకలు రాకుండా రకరకాల స్ప్రేలు ఉన్నప్పటికీ వాటిని వాడితే మనకు సైడ్ ఎఫెక్ట్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఆ స్ప్రే గాలిలో కలిసి మనం పీల్చే పరిస్తితి ఉంటుంది. దానికి బదులు సహజసిద్ధంగా తరిమికొట్టే అవకాశం ఉంది.
ముఖ్యంగా బొద్దింకలకు పసుపు రంగు నలుపు రంగు మాదిరిగా కనిపిస్తుంది. అందువల్ల పసుపు రంగు ఉన్నచోట బొద్దింకలు పెరుగుతాయి. నీటి చమ్మ ఉన్న చోటు బొద్దింకలు పెరుగుతాయి. నీడగా, చీకటిగా ఉండే ప్రాంతాల్లో అవి కాలనీలు పెడతుంటాయి. సహజసిద్ధంగా తరిమికొట్టే ఛాన్స్ ఉన్నప్పుడు స్ప్రేలు, పురుగు మందులు వాడకుండా ఉండడం బెటర్. బొద్దింకలతో పాటు బల్లులను పారిపోవాలంటే మాత్రం డైరెక్ట్ గా వాటిని మనమే తరమాలి. బల్లులను మాత్రం చంపకూడదు.
Advertisement
Advertisement
పొలావులో వేసే బే ఆకులతో తేలికగా బొద్దింకలను తరిమి కొట్టవచ్చు. కిచెన్ లోని వేర్వేరు ప్రదేశాల్లో బే ఆకులను చల్లాలి. వాటి వాసన చూస్తే చాలు. బొద్దింకలు 10 నిమిషాల్లోనే మాయమైపోతాయి.
లవంగాలను వంటగదిలోని మూలలు, ర్యాకులు, షెల్పుల్లో అక్కడక్కడా ఉంచండి. లవంగాల వాసన కూడా బొద్దింకలకు అస్సలు పడదు. వారానికొకసారి పాత లవంగాలను తీసేసి కొత్త లవంగాలను పెడుతుంటే ఇక ఇంట్లోకి బొద్దింకలు రావు.
బోరిక్ పౌడర్, పంచదారను సమాన మోతాదులో తీసుకొని కలపాలి. ఆ పొడిని వంటగదిలోని మూలల్లో చల్లాలి. అప్పుడు బొద్దింకలు రమ్మన్నా రావు. చీకటిగా, ఇరుకుగా ఉండే ప్రదేశాల్లో ఈ పొడి వేయడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.
వేప ఆకుల వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. బొద్దింకలను పంపించేందుకు వేప నూనె, వేప ఆకులను వాడవచ్చు. వేపనూనె, వేప పొడిని కిచెన్‌లో చల్లితే చాలు. ముఖ్యంగా రాత్రివేళలో తడిగా ఉన్న ప్రదేశాల్లో చల్లితే బొద్దింకలు పారిపోతాయి. ఇలా చేస్తే బొద్దింకల సమస్య ఇక ఉండదు. పూర్వ కాలంలో వీటన్నింటిని పాటించారు. ప్రస్తుతం ఎక్కువగా స్ప్రే ను ఉపయోగిస్తున్నారు. కానీ వాటి వల్ల మనకు ఎఫెక్ట్ కలుగుతుంది. కాబట్టి స్ప్రే ఉపయోగించకుండా నేచురల్ పద్దతిలోనే బొద్దింకలను తరిమికొట్టండి.
Also Read :
పురుషులకు పుట్టుమచ్చలు అక్కడ ఉంటే ఏమవుతుందో మీకు తెలుసా..?
చంద్రబాబుతో సినీ నటుడు మోహన్‌బాబు భేటీ.. అసలు కారణం అదేనా..?