హాయిగా నిద్ర పోవాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ నిద్ర పట్టదు. మీకు కూడా రాత్రి పూట నిద్ర సరిగా పట్టట్లేదా..? అయితే ఇలా చేయండి. ప్రస్తుతం బిజీ లైఫ్ లో చాలామంది ఆలస్యంగా నిద్రపోతున్నారు. దీంతో అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. నిద్రలేమి కారణంగా దీర్ఘకాలిక సమస్యల వారిని పడుతున్నారు రాత్రిపూట ఆలస్యంగా నిద్ర పోవడం వలన శారీరక హాని కలుగుతుంది. సాధారణంగా ఎనిమిది గంటలకంటే ఎక్కువసేపు నిద్రపోవాలని వైద్యులు చెప్తున్నారు. కానీ చాలామంది తక్కువ సమయం మాత్రమే నిద్రపోతారు. దీంతో అనేక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
Advertisement
నిద్రలేమితో గుండెకు సంబంధించిన జబ్బులు, అధిక రక్తపోటు, ఉబకాయం, షుగర్ వంటి సమస్యలు కూడా రావచ్చు. పనిలో ఒత్తిడి వల్ల లేకపోతే డిప్రెషన్ వల్ల లేదా ఇతర కారణాల వలన నిద్రించే టైం పూర్తిగా తగ్గిపోతోంది. కంటి నిండా నిద్ర లేకపోవడం వలన ఏకాగ్రత చూపలేరు ప్రతిరోజు నిద్రకు సమయం కేటాయించాలి. ఒకే సమయానికి నిద్రపోవాలి ఒకే సమయానికి నిద్ర లేవాలి ఇలా చేయడం వలన ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. తిన్న ఒక గంట తర్వాత నిద్రపోతే హాయిగా నిద్ర పడుతుంది రాత్రి ఎంత తొందరగా నిద్రపోతే అంత మంచిది.
Advertisement
Also read:
అలానే ఆహారపు అలవాట్లు మార్చుకోండి. ఒత్తిడి, యాంగ్జైటీ వంటివి నిద్రకు భంగం కలిగిస్తాయి. అలానే సమస్యలను తీసుకొస్తాయి కాబట్టి సరేనా నిద్ర ఉండేటట్టు చూసుకోవాలి రాత్రిపూట ఎక్కువగా తినడం వలన నిద్ర పట్టదు. ఆరోగ్యానికి కూడా మంచిది కాదు నచ్చిన ఆహారంతో కడుపు నింపితే మాత్రం ఇబ్బందులు వస్తాయి. ఆల్కహాల్, స్వీట్స్, కెఫీన్ ఉండే ఆహార పదార్థాలను రాత్రులు తీసుకోవద్దు.
ఆరోగ్య చిట్కాలు కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!