Home » మీ లవర్ తో బ్రేకప్ తర్వాత కలిశారా..అయితే ఈ టిప్స్ పాటించండి !!

మీ లవర్ తో బ్రేకప్ తర్వాత కలిశారా..అయితే ఈ టిప్స్ పాటించండి !!

by Bunty
Ad

ప్ర‌స్తుత జ‌న‌రేష‌న్ లో ప్రేమ వ్య‌వ‌హ‌రాలు ఎక్కువ‌గా న‌డుస్తున్నాయి. స్కూల్ నుంచి ఈ ప్రేమించుకోవ‌డం మొద‌లు పెడుతున్నారు. వాట్స‌ప్ చాటింగ్‌, డేటింగ్ లు అంటూ తెగ ఎంజాయి చేస్తున్నారు. అలాగే.. తొంద‌ర‌గానే విడి పోతున్నారు. అయితే.. కొంత మంది త‌ప్పు తెలుసుకుని.. మ‌ళ్లీ క‌లుస్తున్నారు. అయితే.. బ్రేకప్ త‌ర్వాత క‌లిసిన జంట‌లు కొన్ని చిట్కాలు పాటిస్తే.. ఎలాంటి అన‌ర్థాలు జ‌రుగవు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Advertisement

గతాన్ని తవ్వవద్దు..

బ్రేకప్ అయిన వ్యక్తి తారసపడితే కొంతమంది వారి పై ఉన్న కోపాన్ని చూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. దీనివల్ల తాత్కాలిక ఆనందం లభించిన తర్వాత మరోసారి చింతించాల్సి రావచ్చు. మీరిద్దరూ విడిపోవడానికి గల కారణాలపై మీకు స్పష్టమైన అవగాహన ఉండి ఉంటుంది. కాబట్టి, మరోసారి తిరిగి గతాన్ని తవ్వుకుని మొడ్ని చెడగొట్టుకోవద్దు.

సాగ‌దీయోద్దు

Advertisement

బంధం విడిపోవడానికి కారణాలు చాలా ఉంటాయి అయితే దాని తాలూకూ జ్ఞాపకాలు కొంత మందిని వెంటాడుతూనే ఉంటాయి ఈ క్రమంలో తమ మాజీ పై మరికొన్ని ప్రశ్నలు నిండిపోతాయి అయితే అనుకోకుండా వారు కలిసినప్పుడు కొంతమంది ఆ ప్రశ్నలను అడుగుతూ మరోసారి చర్చలు పెడుతుంటారు ఇలా చేయడం మంచిది కాదంటున్నారు నిపుణులు. సాధ్యమైనంతవరకు మర్యాదపూర్వకంగా మాట్లాడండి. అంతే కాని పాత విషయాలను ముందు పెట్టి సాగదీయడం వల్ల ఒరిగేదేమీ లేదు అంతే కానీ పాత విషయాలను సాగదీయడం వల్ల ఒరిగేదేమీ ఉండదంటున్నారు నిపుణులు.

జ్ఙాప‌కాల‌ను గుర్తు చేయ‌ద్దు

ప్రేమలో ఉన్నప్పుడు ఇద్దరిమధ్య ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి. చాలామంది బ్రేకప్ తర్వాత వాటిని చెరిపేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి, ఆ వ్యక్తి మల్లి మీకు ఎదురు పడినప్పుడు వాటిని గుర్తు చేయకూడదు అంటున్నారు నిపుణులు. దీనివల్ల మీరు వారిని మళ్ళి ఇష్టపడుతున్నారని భావన వారిలో కలిగే అవకాశం ఉంటుంది. ఇది మరోసారి గొడవలకు దారి తీసే అవకాశం లేకపోలేదు. కాబట్టి, పాత జ్ఞాపకాలను గుర్తు చేయకపోవడమే మంచిది.

Also Read: పుష్ప సాంగ్‌.. మేల్ వెర్ష‌న్ ఎలా ఉందంటే..?

Visitors Are Also Reading