Home » డబ్బులకు లోటు ఉండకూడదంటే ఈ టిప్స్ పాటించండి…!

డబ్బులకు లోటు ఉండకూడదంటే ఈ టిప్స్ పాటించండి…!

by Bunty
Ad

ఇంట్లో ఎలాంటి ఆర్థిక బాధలు లేకుండా చాలా సంతోషంగా ఉండాలని ప్రతిఒక్కరు అనుకుంటారు. కానీ ప్రతి ఒక్కరికి ఆర్థిక బాధ్యతలు తప్పవు. కొంతమంది అనేక రకాలుగా ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ బాధ్యతలతో సతమతమవుతూ ఉంటారు. అయితే ఇబ్బందులతో బాధపడేవారు కచ్చితంగా ఈ సూత్రాలను పాటించాలి. ఇలా కనుక పాటించినట్లయితే ధనలక్ష్మి వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది.

Advertisement

ఆర్థిక బాధల నుంచి బయటపడవచ్చు. ఎప్పుడైనా సరే ఎవరింటికైనా వెళ్లేటప్పుడు ఇంటి ముఖద్వారం అందంగా ఉంటే మనకి కూడా ఆ ఇంటి లోపలికి వెళ్లాలని అనిపిస్తుంది. అలాగే లక్ష్మీదేవికి కూడా అందంగా కనిపిస్తే ఆ ఇంటికి లక్ష్మీదేవి వెళ్తుంది. అంటే ఇంటి ముఖద్వారాన్ని చాలా కలర్ ఫుల్ గా, అందంగా ఉండేటట్టు చూసుకోవాలి. అలా చేసినట్లయితే లక్ష్మీదేవి తప్పకుండా ఇంటికి వస్తుంది. ఇంట్లో జలపాతం లాంటి ప్రవాహం ఉండాలి. చిన్నదైనా సరే దాని కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. అటువంటిది ఇంట్లో పెట్టడం వల్ల నీరు ఎలా అయితే ఫ్లో అవుతుందో డబ్బు కూడా అలానే వస్తుంది. ఇంట్లో కానీ ఆఫీసులో కానీ అనవసరమైన చెత్తచెదారాన్ని ఉంచకూడదు. చెత్త ఉన్నట్లయితే ధనలక్ష్మి ఇష్టపడదు.

Advertisement

రంగురంగుల స్పటిక రాళ్లను ఇంట్లో ఉంచుకుంటే డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు. మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలంటే వంటగదిని ఎప్పుడు శుభ్రంగా, అందంగా ఉంచుకోవాలి. డబ్బుకి వంటగదికి చాలా సంబంధం ఉంటుంది. వంట గదిలో పాజిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది. వంటింట్లో ఉండే ఎనర్జీ ఇంట్లోకి డబ్బు వచ్చేటట్టు చేస్తుంది. అందువల్ల వంటగదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. వంట గదిలో గోడలు, షెల్పులు అన్ని శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా కనుక పాటించారంటే కచ్చితంగా లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది. ఆర్థిక బాధలు తొలగిపోతాయి.

Visitors Are Also Reading