Home » BCCI : మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లు…ప్రయోగం సక్సెస్‌ అవుతుందా ?

BCCI : మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లు…ప్రయోగం సక్సెస్‌ అవుతుందా ?

by Bunty
Ad

 

టీమిండియా క్రికెట్ ఓ న్యూ ఫెజ్ లోకి ఎంటర్ అవుతుంది. అందుకే కాస్త కన్ఫ్యూజన్లో ఉంటుంది టీం సెలక్షన్. ఇప్పుడు బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సౌత్ ఆఫ్రికా సిరీస్ కోసం అయితే చాలానే ప్రయోగాలు చేస్తున్నారు. చాలా సంవత్సరాల తర్వాత టీమిండియా ఫార్మాట్ కో కెప్టెన్ విధానంతో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్తుంది. అజిత్ అగర్కర్ నేతృత్వంలోనే సెలక్షన్ కమిటీ సౌతాఫ్రికా టూర్ కోసం టి20లు, వన్డే టెస్ట్ జట్లను ప్రకటించింది. ఈ సెలెక్షన్ లో ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటో తెలుసుకుందాం…. ఈసారి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ దక్షిణాఫ్రికాతో టెస్టులు తప్ప 20లు, వన్డేలకు దూరం అవుతున్నారు.

Advertisement

అయితే వారిని తప్పించారా లేదా రెస్ట్ తీసుకుంటున్నారా అనే విషయంపై చర్చ జరిపిన బీసీసీఐ ప్రతినిధులు అది కేవలం విశ్రాంతి కోసమేనని క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్ 26న ఆరంభమయ్యే రెండు టెస్టుల సిరీస్ కు రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉంటాడు. బుమ్రా బైస్ కెప్టెన్గా వ్యవహరిస్తాడు. సీనియర్ ఆటగాళ్లు అజింక్య రహానే, చతేశ్వర్ పూజారా, ఉమేష్ యాదవ్ లకు టెస్టు జట్టులో చోటు దక్కలేదు. అందువల్ల వారి కెరియర్ ఇక ముగిసిపోయినట్లే అని భావిస్తున్నారు. శ్రేయస్ అయ్యర్, రుతురాజు గైక్వాడ్ లకు టెస్ట్ జట్లలో స్థానం దక్కింది. టి20 జట్టు విషయానికి వస్తే…. పాండ్యా అందుబాటులో లేడు కాబట్టి సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్గా కొనసాగనున్నాడు.

Advertisement

శుబ్ మన్ గిల్ తొడవడం మినహా దాదాపుగా ఇప్పుడు ఆస్ట్రేలియాతో టి20 సిరీస్ ఆడుతున్న జట్టు సౌత్ ఆఫ్రికాతో కూడా మూడు టీ20లు ఆడనుంది. ఇక మూడు వన్డే మ్యాచుల సిరీస్ కోసం కేఎల్ రాహుల్ కెప్టెన్సీ చేయనున్నాడు. ఇప్పుడు వన్డేలకు అంత ప్రాధాన్యం లేకపోయినా టీం సెలక్షన్ డిఫరెంట్ గా ఉంది. వన్డే టీం లో సంజు శామ్సన్ కు చోటు కల్పించారు. టి20 లో ఫినిషింగ్ అదరగొడుతున్న రింకు సింగ్ కు సాయి సుదర్శన్ రజాక్ పార్టీ దారులకు వన్డే టీం లో అవకాశం దక్కింది. చూడాలి ఈ ప్రయోగాలన్నీ సక్సెస్ అయ్యి నయా టీం ఇండియా తయారవుతుందేమో.

మరిన్ని  క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి !  తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.

Visitors Are Also Reading