మనిషి జీవితంలో ఆందోళన, ఒత్తిడి అనేవి సర్వసాధారణం. ఆర్థికంగానో, పనుల వల్లనో ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక సమయంలో ఆందోళనకు లేదా ఒత్తిడికి లోనవ్వడం సాదారణమే. మనిషి తన జీవితంలో ఈ రెండిండిని తప్పించుకోవడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. కొందరూ వీటిని తేలికగా అధిగమిస్తే మరికొందరూ వీటిని అధిగమించడానికి చాలా సమయం పడుతుంది. కొన్ని రాశుల వారు ప్రతి విషయంలో ఆందోళన, ఒత్తిడికి గురవుతుంటారు. వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కర్కాటక రాశి :
Advertisement
చిన్న చిన్న విషయాలకు కూడా ఆందోళన పడుతుంటారు. వీరు చాలా సున్నిత మనస్కులుగా ఉండడమే. చిన్న చిన్న మాటలకే వీరు చాలా బాధపడుతుంటారు. అందరి ముందు తనను తక్కువ చేశారే అంటూ ఆందోళన పడుతూ ఒత్తిడిలోకి వెళ్తుంటారు. ఆందోళన, ఒత్తిడి విషయాల్లో మిథున రాశి వారిది విచిత్రమైన పరిస్థితి. వాస్తవానికి వీరు చాలా సరదాగా ఉంటారు. అందరితోనూ కలిసి ఉండే స్వభావం. వీరు అతిగా ఆలోచిస్తుంటారు. దీంతో వీరు ఆందోళనకు గురవుతారు.
కన్యరాశి :
Advertisement
ఈ రాశి వారు చాలా పని వంతులు. వీరు కష్టపడి పని చేసే స్వభావం గలవారు. అంతేకాదు వీరు తాము చేసే పని పర్‌ఫెక్ట్ గా ఉండాలని అనుకునే మిస్టర్ పర్‌ఫెక్ట్‌లు. దీంతో చిన్నపాటి పనులను కూడా ఒత్తిడితో ఆందోళనతో పూర్తి చేస్తుంటారు.
వృశ్చిక రాశి :
ఈ రాశి వారు లక్ష్యం వైపు సాగేవారు. వీరు అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటారు. కష్టపడడమే కాదు సాధిస్తారు. అయితే వీరు సాధించిన విజయాన్నిఎప్పుడూ కూడా ఎంజాయ్ చేయరు. తమ తరువాత లక్ష్యం ఏమిటి అన్న కోణంలో ఎక్కువగా ఆలోచిస్తూ ఆందోళన గురవుతుంటారు.
మీనరాశి :
మీన రాశి వారికి తమ గురించి కంటే కూడా ఎదుటివారి గురించే ఎక్కువగా ఆలోచిస్తుంటారు. తన గురించి అలా అనుకుంటున్నారు. ఇలా అనుకుంటున్నారనే ధ్యాసే వీరిని ఒత్తిడిలోకి నెట్టేస్తుంటుంది. ఆ పని చేస్తే వీరు తన గురించి ఏమనుకుంటారనే కోణంలో ఆలోచిస్తు లేనిపోని వాటికి ఎక్కువగా ఆందోళన చెందడం ఈ రాశి వారి నైజం.
Also Read :
Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఒత్తిడిని జయిస్తారు