ప్రేమ ఎప్పుడూ గొప్పదే. ప్రేమించుకున్న ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకుంటారే గ్యారెంటీ లేదు. పెళ్లి పీటల వరకూ వచ్చి ఎన్నో వివాహాలు ఆగిపోతున్నాయి. వివాహాల మాట పక్కన పెడితే, కొన్ని రాశుల వారు ప్రేమ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ప్రేమ విఫలమైతే జీవితమే లేదని బాధపడిపోతారు. దాని నుంచి బయటకు వచ్చేందుకు చాలా సమయం తీసుకుంటారు. ఏ రాశివారి ప్రేమ బంధం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.
Advertisement
మేషరాశి:
వీరు స్వతంత్రంగా ఆలోచించగలిగినప్పటికీ, దీర్ఘకాలిక కట్టుబాట్లపై ఆసక్తిని కలిగి ఉండరు. ప్రేమించిన వ్యక్తి నుంచి విడిపోయాక అందర్ని వదిలి ఏకాంతంగా జీవించేందుకు ఆసక్తి చూపుతారు.
వృషభం
వీరు ప్రేమలో ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉన్నట్టు ఫీలవుతారు. ఒకవేళ వీరి నుంచి ఆ ప్రేమ దూరమైతే తట్టుకోలేరు. అయితే, బ్రేకప్ నుంచి బయటకు వచ్చేందుకు పెద్దగా సమయం తీసుకోరు. కెరీర్‌ను తిరిగి ప్రారంభించే ఆలోచనలు చేస్తారు.
మిధునరాశి
వీరికి భావోద్వేగాలు అధికం. ప్రేమ విఫలమైతే చాలా బాధపడిపోతారు. బ్రేకప్ నుంచి బయటకు రావడానికి చాలా సమయం పడుతుంది. చిరాకుగా కనిపిస్తారు.
కర్కాటక రాశి
వీరు ప్రేమలో విఫలం కావడాన్ని ప్రతికూలంగా చూస్తారు. బ్రేకప్ తరువాత ఇక లైఫే లేదని ఫీలవుతారు. అనుకున్న లక్ష్యాలను పక్కనపెట్టేస్తారు. జీవితంపై పెద్ధగా శ్రద్ద చూపించరు.
సింహరాశి
వీరికి అహంకారం ఎక్కువ. ప్రేమ విషయంలో ఏదైనా సరే తప్పు జరిగితే దానిని అవతలవారిపై వేసే మసస్తత్వం కలిగి ఉంటారు. లవ్ విషయంలో తమ తప్పు లేదని, కెరీర్ పరంగా ముందుకు వెళ్లేందుకే అలా జరిగిందని చెబుతుంటారు.
Advertisement
కన్య రాశి
వీరికి విశ్వాసం చాలా తక్కువ. ఎదుటివారిని పెద్దగా నమ్మరు. పరిచయమయ్యి, ప్రేమంచాలి అంటే వారి చరిత్ర మొత్తాన్ని తనిఖీ చేస్తారు. ప్రేమలో విఫలం అయ్యాక చాలా ఓపిగ్గా కొన్ని విషయాల గురించి ఆలోచిస్తారు. ముందు ముందు అలాంటి వాటిని ఎలా ఎదుర్కొవాలనే దానిపై దృష్టి సారిస్తారు.
తులారాశి
వీరు బ్రేకప్ బాధ నుంచి కష్టం మీద బయటకు వస్తారు. ప్రేమలో విఫలమైతే ఎందుకు అలా జరిగిందని పెద్దగా ఆలోచించరు. భవిష్యత్తుపై దృష్టి సారిస్తారు.
వృశ్చిక రాశి
వీరికి అసూయ ఎక్కువ. అందుకే కొన్నిసార్లు వీరి ప్రవర్తన ఎవరికీ అర్ధంకానట్టుగా ఉంటుంది. ఒకవేళ ప్రేమ విఫలమైతే ఆ బాధను తట్టుకోలేరు. ఒకసారి దెబ్బతింటే మళ్లీ కోలుకోలేమని ఫీలవుతారు. అయితే, దాని నుంచి డైవర్ట్ అయ్యి సక్సెస్ సాధించే వరకు కష్టపడతారు.
ధనుస్సు రాశి
వీరు కాబోయే భాగస్వామి నుంచి చాలా ఎక్కువ ఆశిస్తుంటారు. అంచనాలు పెంచుకుంటారు. వీరి లైఫ్ లో బ్రేకప్ కావడానికి ఇదోక కారణం కావొచ్చు. బ్రేకప్ నుంచి బయట పడటానికి చాలా సమయం తీసుకుంటారు. అనుభవం ఉన్న వ్యక్తుల సలహాల మేరకు అడుగులు వేసి సక్సెస్ సాధిస్తారు.
మకర రాశి
వీరు భాగస్వామిని పెద్దగా విశ్వసించరు. ఇకవేళ బ్రేకప్ అయితే మరోక ఛాన్స్ దక్కుతుందని అనుకుంటారు. లైఫ్‌ను ఈజీగా తీసుకుంటారు. పాజిటివ్‌గా ముందుకు అడుగులు వేస్తారు.
కుంభరాశి
వీరు చాలా తెలివిగా ఆలోచిస్తారు. ఇదే వారికి ఇబ్బందులు తెచ్చిపెడుతుంటాయి. లవ్‌లో పడినా దానిని కూడా తెలివిగా ఆలోచిస్తారు. లవ్ ఫెయిల్యూర్ కాలరణంగా మంచి జరుగుతుందని నమ్ముతారు.
మీన రాశి
ఫెయిల్యూర్ గురించి పెద్దగా బాధపడరు. గతాన్ని వర్తమానంతో పోల్చుకోవడమే వీరి ఎదుగుదలకు అవరోధంగా మారుతుంది. అవకాశం ఇచ్చాం ఎదుటివారు వినియోగించుకోలేదని అలోచిస్తారు. అంతేకాదు, భవిష్యత్తులో ఏం చేయాలి అనేదానిపై దృష్టిసారిస్తారు.