ఇవాళ శని త్రయోదశి, జ్యోతిష్యశాస్త్రంలో శని త్రయోదశికి ఎంతో విశిష్టత ప్రత్యేకత ఉన్నది. ఈ రోజు శనివా దేవుడికి పూజచేస్తే.. దోషాలన్ని తొలిగిపోయి మంచి జరుగుతుంది. ఇవాళ ఏయే రాశుల వారు తప్పనిసరిగా శని పూజ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. శనివారం శని దేవుడికి ఇష్టమైన రోజు. శని న్యాయ దేవుడిగా భావిస్తారు. వ్యక్తుల కర్మలను బట్టి ఫలాలను ఇస్తాడు. శని దేవుడి అనుగ్రహం ఉంటే ఆ వ్యక్తుల యొక్క జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అంతా బాగుంటుంది. సుఖ, సంతోషాలుంటాయి. ఇవాళ శనివారం అందులోనూ శని త్రయోదశి. శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఇంతకన్న మంచి రోజుండదు. శనిదోషం ఉన్నవారు నేడు తప్పకుండా శని దేవున్ని పూజించాలి. ఇవాళ శని దేవుడికి పూజలు చేసిన వారికి కష్టాలు తొలగిపోయి సానుకూల ప్రయోజనాలు కలుగుతాయట.
ప్రస్తుతం శని దేవుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. 29 ఏప్రిల్ 2022న మకరరాశి నుంచి కుంభ రాశిలోకి ప్రవేశించాడు. శని రాశి మార్పుతో కొన్ని రాశుల మీద శనిదైయా, సడే సతి ప్రారంభం అవుతుంది. అందువల్ల ఆయా రాశుల వారు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం కుంభం, మకర, మీన రాశుల వారికి శని సడేసతి నడుస్తుంది. ఏలినాటి శనివల్ల బాధలు తప్పవు. ఇక కర్కాటక వృశ్చిక రాశి వారిపై శని ధైయా చెడు ప్రభావం చూపుతుంది. అందువల్ల 5 రాశుల వారు నేడు శని దేవున్ని పూజిస్తే.. శని దోషం తగ్గుతుంది.
Advertisement
శనివారం సూర్యస్తమయం తరువాత రావి చెట్టు వద్ద దీపం వెలిగించడం ద్వారా శనిదేవుడు సంతోషిస్తాడు. ఈ విధంగా చేయడం ద్వారా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. శనివారం హనుమంతుడిని ఆరాధిస్తే.. శని దేవుడు శాంతిస్తాడు. పురాణాల ప్రకారం.. బజరంగబలి భక్తులను తాను ఎప్పుడు వేధించనని శని దేవ్ హనుమంతుడికి వాగ్దానం చేసాడట. అందుకే శని దోషాలు తొలగించేందుకు హనుమాన్‌ను పూజించాలి. శని దేవుడికి ప్రసన్నం చేసుకోవడానికి శనివారం నాడు రావిచెట్టుకు నీటిని సమర్పించి.. చెట్టు చుట్టూ 7 సార్లు ప్రదక్షిణ చేయండి. పేదవారికి అవసరమైన వారికి శనివారం నూనెను దానం చేయాలి. ఇలా చేస్తే.. శని దోషం తొలగిపోయి అన్ని శుభాలే కలుగుతాయట.
Also Read :
ఎండాకాలంలో రాగి పాత్రలను వాడుతున్నారా..? అయితే మీకు ప్రమాదం పొంచి ఉన్నట్టే లెక్క..!
రైతులకు శుభవార్త.. ముందస్తుగానే నైరుతి ఋతుపవనాలు