Home » ఎండాకాలంలో రాగి పాత్ర‌ల‌ను వాడుతున్నారా..? అయితే మీకు ప్ర‌మాదం పొంచి ఉన్న‌ట్టే లెక్క‌..!

ఎండాకాలంలో రాగి పాత్ర‌ల‌ను వాడుతున్నారా..? అయితే మీకు ప్ర‌మాదం పొంచి ఉన్న‌ట్టే లెక్క‌..!

by Anji
Ad

సాధార‌ణంగా ఎండాకాలంలో మ‌న‌ల‌ను ప‌లు స‌మ‌స్య‌లు వేధిస్తుంటాయి. శ‌రీర ఉష్ణోగ్ర‌త ఎప్పుడు వేడిగా ఉంటుంది. దీని కార‌ణంగా జీర్ణ స‌మ‌స్య‌లు పెరుగుతాయి. ఈ స‌మ‌యంలో మ‌నం ఆహారం పానియాల ప‌ట్ల చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. శ‌రీరాన్ని చ‌ల్ల‌గా ఉంచ‌డానికి ప్ర‌య‌త్నించాలి. అయితే ఎండాకాలంలో రాగి పాత్ర‌ల్లో తిన‌డం, తాగ‌డం అస్స‌లు చేయ‌కూడ‌దట‌. వేస‌వికాలంలో రాగి పాత్ర‌ల్లో తిన‌డం, తాగ‌డం స‌రికాద‌ని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకో పూర్తి వివ‌రాల‌ను ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.


రాగి పాత్ర‌ల్లో ఉంచిన నీటిని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక్క‌నీరు విష‌యంలో మిన‌హాయించి ఎండాకాలం వీటిని ఉప‌యోగించ‌కూడ‌దు. రాగి పాత్ర‌ల్లో వంట చేయ‌డం వ‌ల్ల చాలా చెడ్డ‌ది. దీనివ‌ల్ల ఆహారంలో కాప‌ర్ ప‌రిమాణం పెరిగి శ‌రీరంలో అనేక దుష్ప్ర‌భావాల‌కు కార‌ణ‌మ‌వుతుంది. ర‌క్త‌స్రావం, ఆక‌లి వేయ‌క‌పోవ‌డం, శ‌రీర ఉష్ణోగ్ర‌త పెర‌గ‌డం, విరేచ‌నాలు, ఉబ్బ‌రం మొద‌లైన స‌మస్య‌లు ఏర్ప‌డ‌తాయి. వేస‌విలో పాలు, పుల్ల‌ని ప‌దార్థాల నిలువ కోసం రాగి పాత్ర‌ల‌ను అస్స‌లు ఉప‌యోగించ‌కూడదు. ఎందుకు అంటే అవి ఆమ్ల ప్ర‌తిచ‌ర్య‌ను క‌లిగిస్తాయి. కొన్ని సంద‌ర్భాల్లో పాలు ప‌గిలి పుల్ల‌ని వ‌స్తువుల‌ను పాడు చేస్తుంది.

Advertisement

Advertisement

ఇది మీ శ‌రీరానికి కూడా హానీ చేస్తుంది. వాంతులు అవ్వ‌డం, అతిసారం, ఉబ్బ‌రం మొద‌లైన స‌మ‌స్య‌లు తలెత్తుతాయి. వేస‌విలో పిల్ల‌ల కోసం రాగి పాత్ర‌ల్లో వంట చేయ‌డం, రాగి పాత్ర‌ల్లో తిన‌డం రెండు సుర‌క్షితం కాదు. దీనివ‌ల్ల పిల్ల‌లు రోజు అంతా చురుకుగా ఉండేరు. క‌ళ్లు తిరిగి ప‌డిపోయే స‌మ‌స్య‌లుంటాయి. పిల్ల‌ల‌ను రాగి పాత్ర‌ల‌కు దూరంగా ఉంచ‌డానికి ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించాలి. రాగి ప్ర‌భావం వేడిగా ఉంటుంది. ఈ ప‌రిస్థితుల్లో వేసవి రోజ‌ల్లో ఇది మ‌రింత ప్ర‌భావం చూపుతుంది. కానీ తాగునీటికి సంబంధించి ఎటువంటి స‌మ‌స్య ఉండ‌దు. ప్ర‌తిసారి రాగి గ్లాస్‌లో నీరు తాగొద్దు. రాత్రిపూట రాగి గ్లాస్‌లో నీరుంచి ఉద‌యం పూట తాగితే ప‌ర్వాలేదు. ప‌దే ప‌దే రాగి వ‌స్తువుల‌ను అస‌లు వినియోగించ‌కూడ‌దు.

Also Read : 

Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఓ శుభ‌వార్త వింటారు

సౌత్ ఇండస్ట్రీపై రిచా చ‌ద్దా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

 

Visitors Are Also Reading