Home » పాక్ నుండి భార‌త్ స్వాధీనం చేసుకున్న అతిసుంద‌ర గ్రామం..ప్రత్యేక‌త‌లు ఇవే..!

పాక్ నుండి భార‌త్ స్వాధీనం చేసుకున్న అతిసుంద‌ర గ్రామం..ప్రత్యేక‌త‌లు ఇవే..!

by AJAY
Ad

1971 పాకిస్థాన్ కు భార‌త్ కు మ‌ధ్య యుద్దం జ‌రిగింది. ఈ యుద్దంలో భారత్ పాకిస్థాన్ నుండి ఓ అంద‌మైన‌ గ్రామాన్ని స్వాధీనం చేసుకుంది. ఆ అంద‌మైన గ్రామం పేరు తూర్తుక్ కాగా ఈ గ్రామం భార‌త దేశ‌పు ఉత్త‌ర అంచున నూరా లోయ‌కు చివ‌ర‌న ఉన్న చిన్న‌లోయలో ఉంది. కార‌కూరం ప‌ర్వ‌త శ్రేణిల్లో శియాక్ న‌దిని ఆనుకున్న ఈ గ్రామం ప్ర‌కృతి అందాల‌కు పెట్టింది పేరు. అయితే ఈ అంద‌మైన ఊరికి వెళ్లాలంటే ఎగుడుదిగుడుగా ఉండే రోడ్డు పై ప్ర‌యాణించాల్సిందే. ఇక ఈ గ్రామం 1971 వ‌ర‌కూ పాకిస్థాన్ లోనే ఉండేది.

thurthuk village

thurthuk village

నియంత్ర‌ణ రేఖ వెంబ‌డి భార‌త్ పాక్ ల మ‌ధ్య జ‌రిగిన యుద్దంలో భార‌త్ ఈ గ్రామాన్ని సొంతం చేసుకుంది. ల‌ద్దాక్ లో ఎక్కువ‌గా బౌద్ధులు ఉన్న‌ప్ప‌టికీ ఈ గ్రామంలో సూఫీలు ఎక్కువగా ఉంటారు. ఈ గ్రామ‌స్థులు బాల్టీ భాష‌ను మాట్లాడ‌తారు. ఇక ఇది వ‌ర‌కూ ఈ గ్రామంలో ఆంక్ష‌లు ఉండేవిగానీ ప్ర‌స్తుతం చాలా వ‌ర‌కు ఆంక్ష‌లు త‌గ్గి టూరిస్టుల‌ను ఆహ్వానిస్తున్నారు. ల‌ద్దాక్ లో మిగ‌తా ప్రాంతాల‌తో పోలిస్తే ఈ ప్రాంతం స‌ముద్రమ‌ట్టానికి కాస్త ఎత్తులోనే ఉంటుంది. దాంతో ఈ గ్రామంలో ఊష్ణోగ్ర‌త‌లు కూడా ఎక్కువ‌గానే ఉంటాయి.

Advertisement

Advertisement

క‌శ్మీర్ లో ఉగ్ర‌వాదుల అల‌జ‌డి ఉన్న‌ప్ప‌టికీ తూర్తుక్ లో మాత్రం ప్ర‌శాంత వాతావ‌ర‌ణం క‌నిపిస్తూ ఉంటుంది. 1971లో తూర్తుక్ ను స్వాధీనం చేసుకున్న త‌ర‌వాత గ్రామ‌స్థులంద‌రికీ భార‌త ప్ర‌భుత్వం గుర్తింపు కార్డులు ఇచ్చింది. ఇకడ రొట్టెలు మ‌రియు మాసం ఎక్కువ‌గా తింటూ ఉంటారు. అంతే కాకుండా డ్రైఫ్రూట్ ల‌తో చేసిన పాయ‌సాలు కూడా ఎక్కువగా తింటూ ఉంటారు. ఇక వసంత రుతువులో ఈ గ్రామం అందం చూడ‌టాకి రెండు క‌ళ్లు స‌రిపోవ‌నే చెప్పాలి. గ్రామంలోని కాలువ‌లు..కొండ‌లు ఆకు ప‌చ్చ లేత ఆకుప‌చ్చ చెట్లతో ఈ గ్రామం ఓ సుంధ‌ర వ‌నంలా క‌నిపిస్తూ ఉంటుంది.  ఇంత సుంద‌ర‌మైన గ్రామాన్ని మీరు కూడా చూడాలనుకుంటే ల‌ద్ధాక్ వెళ్లాల్సిందే.

Visitors Are Also Reading