Home » ఈ సంవత్సరం హైయెస్ట్ గ్రాసర్ కలెక్షన్లను సాధించిన టాప్ 5 టాలీవుడ్ మూవీలు ఇవే..!

ఈ సంవత్సరం హైయెస్ట్ గ్రాసర్ కలెక్షన్లను సాధించిన టాప్ 5 టాలీవుడ్ మూవీలు ఇవే..!

by AJAY
Ad

ఈ సంవత్సరంలో ఇప్పటివరకే ఎన్నో తెలుగు సినిమాలు థియేటర్లలో విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్లను రాబడ్డాయి. అందులో భాగంగా ఇప్పటివరకు ఈ సంవత్సరం విడుదల అయిన సినిమాలలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 5 తెలుగు మూవీలు ఏవో తెలుసుకుందాం.

Advertisement

వాల్తేరు వీరయ్య : మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ మూవీలో శృతిహాసన్ హీరోయిన్గా నటించగా బాబి కొల్లి ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. రవితేజ ఈ మూవీలో కీలకమైన పాత్రలో నటించగా కేథరిన్ రవితేజ భార్య పాత్రలో ఈ మూవీలో కేథరిన్ నటించింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను మైత్రి సంస్థ వారు నిర్మించారు. ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన విడుదల అయిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 236.15 గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.

veerasimhareddy-review

 

వీర సింహారెడ్డి : నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా శృతిహాసన్ హీరోయిన్గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 134 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.

Advertisement

సార్ : ధనుష్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ తెలుగు మరియు తమిళ భాషల్లో ఒకేసారి విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 118 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.

దసరా : నాచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్గా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో విడుదల అయింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 115.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.

విరూపాక్ష : సాయి ధరమ్ తేజ్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్గా కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 75 కోట్లకు మించి గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. ఈ మూవీ ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఇప్పటికి కూడా ఈ మూవీకి బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ కలెక్షన్లు దక్కుతున్నాయి.

Visitors Are Also Reading