Home » సక్సెస్ అంటే ఇదే.. ఎక్కడ రిజెక్ట్ అయ్యాడో అక్కడే గెలిచాడు..!

సక్సెస్ అంటే ఇదే.. ఎక్కడ రిజెక్ట్ అయ్యాడో అక్కడే గెలిచాడు..!

by Anji
Ad

సాధారణంగా జీవితం ఎవరినీ ఎప్పుడు ఎలా మారుస్తుందో అస్సలు  చెప్పలేం. నిన్న జీరో అనుకున్నవారే నేడు హీరోలు అవుతారు. అలాంటి ఘ‌ట‌నే టాలీవుడ్ న‌టుడు రాగ్ మయూర్ జీవితంలో చోటు చేసుకుంది. తాను న‌టుడు అవ్వాల‌నే క‌లతో ఎక్కడ మొదటి అడుగు వేసి విఫలమయ్యాడో ఇప్పుడు అక్కడే త‌న కాల‌ర్ ఎగ‌రేసాడు రాగ్ మయూర్. కీడా కోలా మూవీతో  నటుడిగా తన కలను సాకారం చేసుకున్నాడు. దీనికి సంబంధించి రాగ్ మయూర్ పెట్టిన ఒక పోస్ట్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. 

Advertisement

మూవీ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా.. రామా నాయుడు స్టూడియోస్ ముందు ‘కీడా కోలా’ పోస్ట‌ర్‌ను ఉంచారు. ఈ పోస్ట‌ర్‌పై రాగ్ మయూర్ ట్విట్ట‌ర్‌లో స్పందిస్తూ.. ”జీవితం అనేది ఒక స‌ర్కిల్ లాంటిది. అనే విష‌యాన్ని నేను న‌మ్ముతాను. రామా నాయుడు స్టూడియోస్‌కి నేను మొద‌టి సారి ఆడిషన్‌కు వెళ్ళినప్పుడు రిజెక్ట్ అయ్యాను. ఇప్పుడు అదే స్టూడియో ముందు నా సినిమా పోస్ట‌ర్ ఉంది. ఈ విజ‌యాన్ని న‌మ్మ‌లేక‌పోతున్నాను. ఈ స‌క్సెస్‌కు స‌హ‌క‌రించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు” అంటూ రాగ్ మయూర్ రాసుకోచ్చాడు. ఇక ఇది చూసిన నెటిజన్లు సూపర్బ్.. ఆల్ ది బెస్ట్, ఇలాంటి మ‌రిన్ని ప్రాజెక్ట్‌లలో మిమ్మల్ని చూడాలని ఎదురు చూస్తున్నాము అంటూ అభినంద‌న‌లు తెలుపుతున్నారు. 

Advertisement

ఇక సినిమా బండి మూవీతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు రాగ్ మయూర్. లాక్‌డౌన్ టైంలో నేరుగా ఓటీటీలో విడుద‌లైన ఈ చిత్రం మంచి విజ‌యాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో మ‌రిడేష్ బాబు అంటూ రాగ్ మయూర్ చేసిన పాత్ర న‌వ్వులు పూయిస్తుంది. ఇక రాగ్ మయూర్ తాజాగా న‌టిస్తున్న చిత్రం ‘కీడా కోలా’. పెళ్లి చూపులు , ఈ నగరానికి ఏమైంది  వంటి బంపర్‌ హిట్ల తర్వాత తరుణ్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంతో వ‌స్తున్న తాజా చిత్రం ఇది. రాగ్ మ‌యూర్‌తో పాటు తరుణ్‌ భాస్కర్, బ్రహ్మనందం, చైత‌న్య రావు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. సరికొత్త క్రైమ్‌ కామెడీ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీ ద‌గ్గుబాటి రానా సమర్పణలో న‌వంబ‌ర్ 03న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Visitors Are Also Reading