మెగాస్టార్ చిరంజీవి కుటుంబం అంటే ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి, రామ్‌చరణ్, అల్లుఅర్జున్, వరుణ్‌తేజ్, సాయిధరమ్ తేజ్ ఇలా ఏ హీరో సినిమాలు వచ్చినా మెగా ఫ్యామిలీ సినిమాలు అని అభిమానులు ఆదరించేవారు ఆదరిస్తూనే ఉన్నారు. ఇటీవల మెగా సమ్మెళనం జరిగిన విషయం తెలిసిందే. ఈ మీటింగ్‌లో భాగంగా ఏర్పాటు చేసిన బ్యానర్లలో అల్లుఅర్జున్ ఫోటో కూడా లేకపోవడం అందరిలో కొత్త అనుమానాలను రేకెత్తించింది. మీటింగ్ అయితే కాదు.. ఆల్ ఇండియా మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్వామి నాయుడు ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్ కాబట్టి దీనిని అషామాషిగా తీసుకోలేము. ఈ మీటింగ్ కు అల్లుఅర్జున్ అభిమానులకు కూడా ఎంట్రీ నిరాకరించారు.
ఈ తరుణంలో ఈ విషయం చాలా పెద్దదిగానే భావించారు. అల్లుఅర్జున్ మెగా హీరోగా పక్కన పెట్టారనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం అని చెప్పాలి. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే
మెగా హీరో అనే ముద్ర చిరంజీవి నీడలో ఎదిగిన హీరో అనిపించుకోవడానికి అల్లు అర్జున్ కూడా ఇష్టంలేదు. దీనికి కూడా కారణాలు లేకపోలేదు. అల్లుఅర్జున్ తాత గారు అల్లు రామలింగయ్య బ్యాక్ గ్రౌండ్‌తోనే చిరంజీవి స్టార్ హీరోగా ఎదిగారు.
Advertisement
Advertisement
చిరంజీవి సక్సెస్ జర్నీలో అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ పాత్ర కూడా ఉన్నది. ఈ నాలుగేళ్లలో అల్లుఅర్జున్ మెగా హీరోలందరి కంటే ఎక్కువగా రాణించాడు. తెలుగులోనే కాకుండా అతనికి కేరళలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. రాజమౌళి సాయం లేకుండా పాన్ ఇండియా హీరోగా ఎదిగాడనే గౌరవం కూడా అల్లు అర్జున్ పై జనాల్లో ఉంది. మెగా హీరో అనే ట్యాగ్ ను అల్లు అర్జున్ కూడా వద్దనుకుంటున్నట్టు స్పష్టం అవుతుంది.
Also Read :
Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశికి తోటి వారి సలహాలు అనుకూలిస్తాయి
తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూపు-4 నోటిఫికేషన్ ఎప్పుడంటే..?