Home » ‘మురారి’ శాపం వెనుక దాగి ఉన్న స్టోరీ ఇదే.. క్లైమాక్స్ లో ఆ పాటను వద్దన్న కృష్ణ..!

‘మురారి’ శాపం వెనుక దాగి ఉన్న స్టోరీ ఇదే.. క్లైమాక్స్ లో ఆ పాటను వద్దన్న కృష్ణ..!

by Anji
Published: Last Updated on
Ad

మహేష్ బాబు కథానాయకుడిగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ మురారి.  ఈ సినిమాలో సోనాలి బింద్రే కథానాయకగా నటించింది. 2001 ఫిబ్రవరి 17న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ సాధించింది. ఈ సినిమా విడుదల అయ్యి 23 ఏళ్లు పూర్తయింది. అసలు ఈ సినిమా కథ ఎలా సిద్ధం అయింది..?   ‘మురారి’ అనే పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది..> అనే ఆసక్తికరమైన విషయాలను తాజాగా డైరెక్టర్  కృష్ణవంశీ   వెల్లడించారు.

Advertisement

సాధారణంగా ప్రతి సినిమాలో వీళ్ళని హీరో చంపడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఈసారి అతడు మనిషై ఉండకూడదు అనుకుంటున్నాం. ఒక ఫోర్స్ అవ్వాలి.. దానిని ఎలా జయించాలో ఎవరికీ తెలియకూడదు. చివరి నిమిషం వరకు ఉత్కంఠతో ఎదురుచూస్తుండాలి. జనానికి ప్రపంచానికి మంచి చేసే ఒక దేవత కోపానికి కారణమైన ఓ వ్యక్తి ఆ శాపం నుంచి ఎలా బయటపడ్డాడు అన్న దాని నుంచి అనుకోని మురారి కథను డెవలప్ చేసాం.. మైథాలజికల్ కథలో మన సంస్కృతి, సాంప్రదాయాలను కూడా అద్భుతంగా చూపించాం. ఆ సమయంలో మహేష్ బాబు రూపం ముగ్ద మనోహరంగా ఉంటుంది ఆయనను చూడగానే బృందావనం గుర్తుకొచ్చింది.  అందుకే ఈ సినిమాకు మురారి అనే టైటిల్ పెట్టాం అని కృష్ణవంశీ చెప్పుకొచ్చారు.

Advertisement

మురారి సినిమా పరంగానే కాదు.. మ్యూజికల్ పరంగా కూడా మంచి హిట్ అయింది. ఈ సినిమాకి మణిశర్మ అందించిన పాటలు ఎవర్గ్రీన్ అనే చెప్పాలి. ముఖ్యంగా అలనాటి రామచంద్రుడి పాట ఇప్పటికీ పెళ్లి వేడుకల్లో  మోగుతూనే ఉంది. ఈ పాటను క్లైమాక్స్ ముందు వద్దని అందరూ అన్నారట.  పట్టుబట్టి కృష్ణవంశీ పాటను పెట్టించారట. మురారి సినిమాకు ముందు మహేష్ బాబు రెండు ఫ్లాప్ సినిమాలు తీశారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి తెలుగు కమర్షియల్ సినిమా ప్రకారం క్లైమాక్స్ ముందు మాస్ సాంగ్ ఉండాలి.  కానీ నేను అలనాటి రామచంద్రుడు పాట చివర్లో పెట్టాను. అందరూ వద్దని చెప్పారు మొహమాటంతో మహేష్ బాబు కూడా నాకు చెప్పలేని పరిస్థితి. ఒకసారి ఆ విషయాన్ని ప్రస్తావిస్తే ఆయనను ఒప్పించాను.

చివరికి కృష్ణ గారి వరకు పంచాయతీ వెళ్ళింది. అబ్బాయి చివర్లో మాస్ సాంగ్ లేకపోవడం కరెక్ట్ కాదు కదా.. అనవసరంగా ప్రయోగం చేస్తున్నావన్నారు. సార్ ఇప్పుడు మన ముందు రెండే ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి సినిమా పాటను నన్ను చేయనియడం.. రెండోది సినిమాను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతా. లేదంటే కమర్షియల్ సాంగ్ చేసి విడుదల చేసుకోండి. నా పేరు కూడా వేయవద్దు. ఎందుకు అంటే నేను చేసే ఈ పాట దశాబ్దాల పాటు ఉండిపోతుంది. మీ అబ్బాయి కెరీర్ కి కావాలంటే ఆ చండాలాన్ని పెట్టుకోండి..  నేను వెళ్లిపోతా అన్నాడట.  అలా చివరికి ఆ కృష్ణ గారు ఒప్పుకున్నారు. దీంతో ఆ పాట చివర్లో పెట్టడం వెనక కారణం కృష్ణ గారే అని చెప్పుకొచ్చారు కృష్ణవంశీ. 

Also Read :  Sr ఎన్టీఆర్ కి ఉపాసన గారి తాతయ్య చేసిన సహాయం ఏంటో తెలుసా !

Visitors Are Also Reading