Home » టాలీవుడ్ లో మొదటిసారి 100రోజుల ఫంక్షన్ చేసుకున్న మూవీ..!

టాలీవుడ్ లో మొదటిసారి 100రోజుల ఫంక్షన్ చేసుకున్న మూవీ..!

by Sravanthi
Ad

ఓల్డ్ ఇస్ గోల్డ్ అని ఊరికే అనలేదు. అప్పటి మనుషులైన , అప్పటి పనులైన ఏదైనా సరే ఇప్పటి కాలంతో పోల్చుకుంటే చాలా బెటర్. అప్పటి కాలం మనుషులు వందేళ్లు బతికేవారు.. అందుకేనేమో నిండు నూరేళ్లు పిల్లాపాపలతో బతకండి అని దీవించేవారు.. ఆ విధంగానే అప్పటి సినిమాలు కూడా మంచి కథ, కథనం ఉంటే థియేటర్ లలో కనీసం వంద రోజుల నుంచి 200 రోజులు ఆడేవి.. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు తగ్గాయి. అప్పట్లో సినిమా 100 రోజులు ఆడింది అంటే తప్పకుండా వంద రోజుల ఫంక్షన్ చాలా గ్రాండ్ గా చేసేవారు.

Advertisement

also read:బాలకృష్ణని చూసి స్టేజి పైనే కన్నీరు పెట్టుకున్న jr.ఎన్టీఆర్.. కారణమేంటంటే..?

కానీ ఈ కాలంలో అలాంటి పరిస్థితి లేదు. సినిమా కరెక్ట్ గా వారం రోజులు గట్టిగా ఆడితే, పెట్టిన బడ్జెట్ కంటే కోటి రూపాయలు ఎక్కువ వచ్చిన సినిమా హిట్ గా భావిస్తున్నారు. అప్పటికి ఇప్పటికి జనరేషన్ మారింది. కానీ కొన్ని సినిమాల్లో ఊహించినంత కంటెంట్ ఉండడం లేదు. ఇదంతా పక్కన పెడితే తెలుగు సినిమా చరిత్రలోనే మొట్టమొదటిసారి 100 రోజుల ఫంక్షన్ చేసుకున్న సినిమా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 1948లో ప్రతిభ ఫిలిమ్స్ తరపున ఘంటసాల బాలరామయ్య నిర్మాణంలో “బాలరాజు” చిత్రం అప్పట్లో ఒక ఊపు ఊపింది. ఈ చిత్రం విజయవాడలో ఏడాదికి పైగా అలాగే 12 కేంద్రాలు రెండు వందల రోజులకు పైగా ఆడింది.

Advertisement

ఈ సినిమా అంతకుముందు ఉన్న అన్ని సినిమాలను వెనక్కి నెట్టిందని తెలుస్తోంది. అయితే ఈ చిత్రం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్ని కేంద్రాల్లో వేడుకలు నిర్వహించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే 100 రోజుల ఫంక్షన్ జరిపే సాంప్రదాయానికి ఈ మూవీ శ్రీకారం చుట్టిందని అంటుంటారు సినీ పెద్దలు. టాలీవుడ్ లో తొలి రజతోత్సవ చిత్రంగా బాలరాజు మూవీ నిలిచింది. అంతేకాకుండా ఇదే సంవత్సరం విడుదలైన చంద్రలేఖ తమిళ మూవీ సంచలన విజయనందుకుంది, ఈ సినిమా కోలీవుడ్ లోనే కాకుండా తెలుగులో కూడా భారీ విజయాన్ని అందుకుంది. తెలుగులో సింగిల్ థియేటర్లో రజతోత్సవం జరుపుకున్న మొదటి చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఈ విధంగా తెలుగు ఇండస్ట్రీలో మొట్టమొదటిసారి వందరోజుల ఫంక్షన్ జరుపుకుంది. ఈ ట్రెండు అప్పటినుంచి కొనసాగుతూ వస్తుంది.

also read:

Visitors Are Also Reading