ఎన్టీఆర్ గురించి తెలియని వారు ఎవ్వరూ దాదాపు తెలుగు రాష్ట్రాల్లో ఉండరు. ఆయన సినిమాల్లో ఉన్నప్పుడు ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ఒకింత సీరియస్‌గా కనిపించేవారు. కానీ దీనికి ముందు సినీ రంగంలో ఆయన చాలా జోష్‌గా కనిపించేవారు. ఎలాంటి భేషజాలు లేకుండా ఆయన అందరినీ కలుపుకొనిపోయేవారు. లైట్ బాయ్ నుంచి మేకప్ మేన్ వరకు దర్శకుడి నుంచి నిర్మాత వరకు ఎవరికీ ఇవ్వాల్సిన గౌరవం వారికి ఇచ్చేవారు. అంతేకాదు.. అందరితో కలివిడిగా ఉండేవారు. ఎక్కువగా అందరితో కలిసే భోజనం చేసేవారు.
Advertisement
Also Read :
Advertisement
అదే సమయంలో ఆయన తన అభిరుచులకు తగ్గట్టు వండించుకునే ఆహార పదార్థాలను కూడా అందరితో కలిసి పంచుకునేవారు. నా కోసం నీ కోసం ఏమిటోయ్ అందరూ తినవచ్చు. తిందాం అంటూ యూనిట్‌లో అందరినీ కలుపుకొని కూర్చుని తినేవారు. సాధారణంగా పెద్ద హీరో అనగానే ప్రత్యేకంగా డైనింగ్ ఏర్పాట్లు చేస్తారు. స్టార్ హోటల్ నుంచి ఆహారం తీసుకొస్తారు. స్టార్ హోటల్ అప్పట్లో కూడా ఉండేది. ఎన్టీఆర్ ముఖ్యంగా పక్కా మాస్… పల్లెటూరు నుంచి వచ్చిన రైతు బిడ్డ. మనిషి అన్నప్పుడు కలివిడి ఉండాలోయ్ కలివిడి నేనొక్కడినే కూర్చొని తింటే రుచి కూడా తెలియదని తరుచుగా తనతో అనేవారని గుమ్మడి వెంకటేశ్వరరావు తన పుస్తకంలో ఇలా రాసుకున్నారు. ఎస్వీ రంగారావు, గుమ్మడి ప్రభాకర్ రెడ్డి, రావు గోపాల రావు, అల్లు రామలింగయ్య, రాఘవేంద్రరావు, అందరితోనూ ఎన్టీఆర్ వంటకాలను పంచుకునేవారు.
ముఖ్యంగా అన్నగారికి వెజ్ పచ్చళ్లలో ఆవకాయ్ కంటే కూడా మాగాయనే ఎక్కువగా ఇష్టం. నిమ్మకూరులో ఉండే వారి పిన్ని ఆయన కోసం మాగాయ పచ్చడిని పట్టి ప్రత్యేకంగా ఫ్యాక్ చేసి చెన్నైకి పంపించేవారట. ఈ మాగాయ్ పచ్చడి కోసం ఎన్టీఆర్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేవారట. మాగాయ్ అందడమే ఆలస్యం. అదేకూర, అదే పచ్చడి, అదేరసం, అన్నట్టుగా దాంతోనే లాగించేవారు. తన చుట్టూ ఉన్న వారికి కూడా రుచి చూపించేవారు. ముఖ్యంగా మా ఊరి మాగాయ్ తినాల్సిందే అని సావిత్రి, భానుమతి, ఎల్లార్, ఈశ్వరి వంటి చాలా మందికి ప్రత్యేకంగా రుచి చూపించారు అన్నగారు.
Also Read :
వర్షాకాలంలో ఆ రసం తాగితే ఎలాంటి రోగాలు దరిచేరవు..!