కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ప్రజల తరఫున పోరాటం చేయాలని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి కేటీఆర్ చెప్పారు. ఐదేళ్లు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. ఆ పార్టీ ఇచ్చిన హామీల పుస్తకాన్ని బైబిల్, ఖురాన్, భగవద్గీత లాగా చదివి అమలు చేసే వరకు కూడా వదలదని కార్యకర్తలని కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు. ఒక నెలలో ప్రజా వ్యతిరేకతని మూటగట్టుకున్న ప్రభుత్వం ఒక్క కాంగ్రెస్ మాత్రమే అని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ భవన్ లో జరిగిన భువనగిరి పార్లమెంట్ సమీక్ష సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement
భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అలానే మిగతా ఆరు నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేలు వచ్చారు. ఎన్నికల్లో ఎదురు దెబ్బలు సహజమే ఈరోజు మనం ఓడిపోయామని నిరాశ చెందక్కర్లేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఇష్టం వచ్చినట్లు దుష్ప్రచారం చేయించారు అని అన్నారు. ఇంటింటికి మంచినీళ్లు ఇచ్చింది నిజమే కదా మొన్న కూడా నియోజకవర్గంలో ఫ్లోరైడ్ సమస్య తీర్చింది నిజమే కదా అని అన్నారు. పదేళ్లలో చేసిన అభివృద్ధి కనిపిస్తుంటే కళ్ళులేని కబోదిలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోంది అని ఇప్పుడే ట్రైలర్ స్టార్ట్ అయిందని కేటీఆర్ అన్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!