బాల్య వివాహాలు అనేవి మన వ్యవస్థలో ఎప్పటినుంచో ఉన్నాయి. ఇప్పటికి కూడా కొంతమంది కొన్ని చోట్ల బాల్య వివాహాలు జరిపిస్తున్నారు. చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్న బాలికలు జీవితమంతా నరక ప్రాయాన్ని అనుభవిస్తున్నారు. ఒకవేళ భర్త చనిపోతే ఆ బాలిక జీవితాంతం అలా ఉండాల్సిందే. అయితే ఇవే కష్టాలను అనుభవించాల్సి వస్తుందనుకుందేమో కానీ ఆ యువతి మాత్రం తన బాల్య వివాహాన్ని చాలా తెలివిగా కోర్టులో రద్దు చేయించుకుంది. దీంతో ఇప్పుడు ఆమె ఉన్నత చదువులు చదివి అనుకున్న లక్ష్యాన్ని సాధించే పనిలో పడింది. ఆమె పేరే సుశీల.. ఈమె రాజస్థాన్లోని జోధ్పూర్ లో ఉంటుంది. ఈమెకు 12 సం. వయసులోనే స్థానికంగా ఉండే నరేష్ అనే వ్యక్తి తో 2010 సంవత్సరంలో పెళ్లి చేశారు.
Advertisement
అయితే పెళ్లి జరిగినప్పటినుండి సుశీల తల్లి దగ్గరే ఉంటుంది. దీంతో 18 సంవత్సరాలు రాగానే అత్తవారింటికి పంపడానికి తల్లిదండ్రులు అన్ని పనులు పూర్తి చేశారు. సుశీల కు వెళ్ళడం ఇష్టం లేక తన తల్లిదండ్రులతో చెప్పింది. నాకు చదువంటే ఇష్టం చదువుకుంటాను అని అత్తవారింటికి పోనని వేడుకుంది.వాళ్ళు ఎంత చెప్పినా వినకుండా అత్తింట్లో దిగపెట్టేందుకు సిద్ధమయ్యారు. దీంతో సుశీల 2016 ఏప్రిల్ 27న ఇంట్లో నుంచి అర్ధరాత్రి బయటకు వచ్చేసింది. జోద్ పూర్ లో ఉన్న చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యురాలు కృతి భారతి సహాయంతో రిహాబిలిటేషన్ సెంటర్ లో చేరింది. అక్కడ ఉండే కోర్టులో కేసు వేసింది.
Advertisement
తనకు చిన్నప్పుడే పెళ్లి చేశారని, తనకు పెళ్లి ఇష్టం లేదని ఇప్పుడు మేజర్ అయ్యాను కనుక పెళ్లిని రద్దు చేయాలని కోర్టులో కోరింది. అయితే కోర్టు సాక్షాలు చూపమని అడిగింది. సాక్షాలు లేకపోవడంతో సుశీల సుమారు 15 నెలల పాటు కోర్టుతో పోరాడింది. అయితే ఈ క్రమంలోనే భర్తకు చెందిన ఫేస్ బుక్ అకౌంట్ లో షేర్ చేసిన తన పెళ్లి ఫోటోలు ఆమెకు కనిపించాయి. వాటి సాయంతో కోర్టులో మరోసారి వాదించింది. దీంతో కోర్టు సుశీల పెళ్లిని రద్దు చేసింది. దీంతో ఆమె ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నత చదువులు చదువుతోంది. అయితే ఆమె గొప్ప స్థానాలకు చేరుకోవాలని ఆమె కల,ఆశయం. ఆమె బాగా చదివి పోలీస్ ఆఫీసర్ అవ్వాలని కోరుకుంటుంది ఆమె కల నెరవేరాలని మనం కూడా కోరుకుందాం.
ALSO READ;
“బంగారం” సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా..?.ఇప్పుడు ఎంత అందంగా ఉందో చూడండి….!
అలనాటి చిరంజీవి హీరోయిన్ అరుణ ఆస్తుల విలువ అన్ని కోట్లా..? అసలు నిజం అదేనని తెలుసా..?