Home » తల్లిదండ్రులు పిల్లల ముందు చేయకూడని పనులు.. 2 చాలా ఇంపార్టెంట్..!!

తల్లిదండ్రులు పిల్లల ముందు చేయకూడని పనులు.. 2 చాలా ఇంపార్టెంట్..!!

by Sravanthi

చాలామంది భార్యాభర్తలు పిల్లల ముందు అనేక పనులు చేస్తూ ఉంటారు. ఆచార్య చాణిక్యుడు చెప్పిన దాని ప్రకారం తల్లిదండ్రులు పిల్లల ముందు చేయకూడని కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయి. ఇవి వారి ముందు అస్సలు చేయకూడదట. మరి ఆ పనులేంటి ? చేస్తే ఏం జరుగుతుంది? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..
వాదించుకోవడం:

తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లో కూడా పిల్లల ముందు ఒకరికొకరు కించపరుచుకుంటూ మాట్లాడుకోకూడదట. గొడవలు పడకూడదట. ఒకరికొకరు ఎప్పుడు గౌరవం ఇచ్చిపుచ్చుకుంటూ ఉండాలి.ఈ విధంగా ఉండటంవల్ల పిల్లల దృష్టిలో తల్లిదండ్రులపై గౌరవం పెరగడమే కాకుండా వారు కూడా ఆనందంగా ఉంటారని చాణిక్యుడు తన నీతి శాస్త్రంలో పేర్కొన్నారు.
అబద్ధాలు చెప్పకూడదు :


చాణక్య నీతి ప్రకారం కుటుంబ సభ్యులు ఎవరైనా సరే పిల్లల ముందు అబద్ధాలు చెప్పకూడదట. దీనివల్ల పిల్లల దృష్టిలో మీ గౌరవం తగ్గుతుందని, ఎందుకంటే పెద్దలను అనుసరించే పిల్లలు ఏదైనా నేర్చుకుంటారు.కాబట్టి మీరు అబద్ధాలు ఆడితే వారిపై ఈ ప్రభావం పడి వారు భవిష్యత్తులో అనేక సమస్యలు తీసుకొచ్చే అవకాశం ఉందని ఆచార్య చాణిక్యుడు తెలియజేశారు.
లోటుపాట్లు ఎత్తి చూపడం :

చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లల ముందు, ఒకరి లోపాలను ఒకరు ఎత్తి చూపకూడదు అని,ఇలా చేయడం వల్ల పిల్లల దృష్టిలో తల్లిదండ్రులపై గౌరవ మర్యాదలు తగ్గుతాయి. అంతేకాకుండా భాష విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలని, ఒకరినొకరు బూతులు తిట్టుకోకూడదని,ఈ విధంగా చేస్తే పిల్లలపై ఆ ప్రభావం పడే అవకాశం ఉందని ఆచార్య చాణిక్యుడు తన నీతి శాస్త్రం ద్వారా తెలియజేశారు.

also read:

Visitors Are Also Reading