ఒకప్పటి హీరోలు తెలుగు సాహిత్యంలో పండితులు. ఎంతటి డైలాగునైనా అవలీలగా చెప్పేవాళ్లు. ఎన్టీఆర్ అయితే తెలుగు మాట్లాడటం…రాయడం చదవడంలో ప్రతిభ చూపిస్తూ ప్రశంసలు అందుకునేవారు.
Advertisement
అంతే కాకుండా ఏఎన్ఆర్, కృష్ణ, కృష్ణం రాజు నుండి చిరంజీవి, బాలయ్య వరకూ ఇలా అందరికీ తెలుగు రాయడం చదవడం వచ్చు. అయితే ఈ తరం హీరోలలో చాలా మందికి అసలు తెలుగు చదవడం రాయడం రాదు.
Also Read: సింగర్ సునీత భర్త మీకు తెలుసా.. ?
అలా తెలుగు నేల పై పుట్టినప్పటికీ తెలుగు రాయడం చదవడం రాని హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం..సూపర్ స్టార్ మహేశ్ బాబు తెలుగులో డైలాగులు చెబుతారు మాట్లాడతారు కానీ ఆయనకు తెలుగు రాయడం కానీ చదవడం కానీ రాదు. సినిమా షూటింగ్ లో ఆయన డైలాగులను ఇంగ్లీష్ లో రాసుకుని చదువుతారట. హీరోయిన్ జయసుధకు తెలుగు రాదు అంటే ఎవ్వరూ నమ్మరు కానీ అదే నిజం.
జయసుధ ఎన్నో సినిమాల్లో నటించిన తెలుగు మాత్రం నేర్చుకోలేదు. ఆమె కూడా డైలాగులను అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పింది విని ఆ తరావత చెబుతారట. ఇదిలా ఉంటే మంచు లక్ష్మికి తెలుగు రాదు అని అందరికీ తెలుసు.
Advertisement
ఒక్కసారి మంచు లక్ష్మి స్పీచ్ వింటే ఆ విషయం ఎవరికైనా తెలిసిపోతుంది. అంతే కాకుండా మంచులక్ష్మి పై ఇంగ్లీష్ టీచర్ అనే ట్రోల్స్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. కేవలం మంచు లక్ష్మికే కాకుండా ఆమె ఇద్దరు తమ్ముళ్లకు కూడా తెలుగు రాదంట.
ఇటీవలే మంచు విష్ణు టంగుటూరి ప్రకాశం ఫంతులు అని పలుకుతూ తన పరువు తీసుకున్నారు. ఆయనకు సైతం తెలుగు రాయడం కానీ చదవడం కానీ రాదట. మరో మంచు హీరో మనోజ్ ది కూడా ఇదే పరిస్థితి అట.
అక్కినేని వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జునకు కూడా పొట్ట చీలిస్తే ఒక్క తెలుగక్షరం కూడా రాదట. ఈ విషయం చాలా మందికి తెలియదు. నాగ్ కూడా ఏ డైలాగు అయినా ఇంగ్లీష్ లో రాసుకుని చెప్పడమే వచ్చట. కేవలం వీళ్లే కాకుండా తెలుగు హీరోలు వరుణ్ సందేశ్, తరుణ్, నాగచైతన్య, అఖిల్, నిహారిక వరుణ్ తేజ్ లకు సైతం తెలుగు రాదంట.
Also Read: మహానటి సావిత్రికి పద్మ శ్రీ రాకుండా అడ్డుకున్నది ఎవరో తెలుసా?