Home » అధిక శ్రావణ మాసంలో చేయకూడని పనుల గురించి మీకు తెలుసా ?

అధిక శ్రావణ మాసంలో చేయకూడని పనుల గురించి మీకు తెలుసా ?

by Anji
Ad

ఈ ఏడాది అధిక శ్రావణ మాసం వచ్చిన విషయం తెలిసిందే. సాధారణంగా ఇంగ్లీషు క్యాలెండర్ లో లీప్ సంవత్సరం మాదిరిగానే తెలుగు క్యాలెండర్ లో అధిక మాసాలు వస్తుంటాయని పండితులు పేర్కొంటున్నారు. ఈ శోభకృత్ నామ సంవత్సరంలో శ్రావణ మాసం అధికంగా వచ్చింది. పూర్తి శ్రావణమాసంగా భావించడానికి వీలు లేదు. వాస్తవానికి అసలు శ్రావణ మాసానికి అధిక శ్రావణానికి తేడా చాలా ఉంటుంది. అన్ని మాసాలతో పోల్చితే శ్రావణ మాసానికి చాలా తేడా ఉంటుంది.

Advertisement

ముఖ్యంగా హిందువులు ఈ మాసాన్ని చాలా ప్రత్యేకంగా భావిస్తారు. ఉపవాసాలు, పండుగల మాసంగా పరిగణిస్తారు. అంతేకాదు.. ఈ సమయంలో వర్షాలు అధికంగా కురుస్తాయి. వాగులు, వంకలు, చెరువులు, సరస్సులు, నదులు పొంగిపొర్లుతాయి. కాలాన్ని లెక్కిస్తే.. 365 రోజులు 6 గంటల వస్తే.. చంద్రమానం ప్రకారం.. 354 రోజులు మాత్రమే ఉంటాయి. దాదాపు 11 రోజుల తేడా ఉంటుంది. ఏడాది గణనలో ఉండే ఈ తేడాలను బ్యాలెన్స్ చేసేందుకు ప్రతీ మూడేళ్లకు ఒకసారి ఈ మాసం అధికంగా వస్తుంది. అధిక శ్రావణమాసం మొత్తం 19 ఏళ్లకు ఒకసారి వస్తుంది. తెలుగు పంచాంగం ప్రకారం.. జులై 18 నుంచి అధిక శ్రావణ మాసం ప్రారంభమై.. ఆగస్టు 16 వరకు ఉంటుంది. ఆగస్టు 17 నుంచి అసలు శ్రావణ మాసం ప్రారంభమవుతుంది అంటున్నారు పండితులు.

Advertisement

అధిక శ్రావణ మాసంలో పూజా కార్యక్రమాలతో పాటు దాన ధర్మాలు చేయాలని.. అలా చేసిన కార్యక్రమాలకు పూజలకు రెట్టింపు ఫలితం వస్తుందన్నారు. ఆగస్టు 16వ తేదీన ముగుస్తుంది. ఆగస్టు 17 నుంచి శ్రావణ మాసం ప్రారంభం అవుతుందని.. అప్పటి నుంచి శుభకార్యక్రమాల ముహుర్తములు ప్రారంభం అవుతాయి. అదిక మాసం యొక్క మహిమ గురించి మహా విష్ణువును లక్ష్మీదేవిని అడిగినప్పుడు పురుషోత్తమ మాసంలో ఎవరు అయితే పుణ్య నది స్నానాలు, జప, హోమం, దానాలు ఆచరిస్తారో వారికి సాధారణ మాసాల కంటే అనేక రెట్ల ఫలితాలు లభిస్తాయి. అధిక మాసంలో పుణ్యకర్మలు, ఆచరించని వారి జీవితాల్లో కష్ట, నష్టాలు ఎదురవుతాయి. అధిక శ్రావణ మాసంలో అష్టమి, నవమి, ఏకాదశి, ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి వంటి తిథుల్లో   శుక్లపక్షంలో,కృష్ణ పక్షంలో కానీ పుణ్యకార్యాలు చేయాలి. ఇలా చేస్తే పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

అలనాటి హీరోయిన్ రాశి కెరీర్ ను నాశనం చేసింది ఎవరో తెలుసా..?

నటుడు సముద్రఖని డైరెక్ట్ చేసిన సూపర్ హిట్ సీరియల్ ఏదో తెలుసా..?

ప్రభాస్ నెక్ట్స్ మూవీ ఫిక్స్.. ఆ దర్శకుడితోనే..!

Visitors Are Also Reading