ఈ రోజుల్లో చాలామంది జుట్టు రాలిపోవడంతో బాధపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా జుట్టు రాలుతుంది. చిన్న వయసు వాళ్లలో కూడా జుట్టు రాలిపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. అయితే జుట్టు సమస్యలేమీ లేకుండా ఉండాలంటే గుమ్మడి గింజలు అందుకు బాగా సహాయం చేస్తాయి. గుమ్మడి గింజలతో ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు కురులు కూడా గుమ్మడి గింజల వలన బాగుంటాయి. జుట్టుకి సంబంధించిన ఎలాంటి సమస్య కూడా ఉండదు. జుట్టు సంరక్షణకు గుమ్మడి గింజలు బాగా ఉపయోగపడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
Advertisement
Advertisement
గుమ్మడి గింజల్లో అసంతృప్తి కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. జుట్టు పెరుగుదలని ఇవి ప్రేరేపిస్తాయి. పోషకాలు కూడా గుమ్మడి గింజలు ఎక్కువగా ఉంటాయి. గుమ్మడి గింజలని ఒక గుప్పెడు రోజు తీసుకుంటే జుట్టు పెరుగుదల బాగుంటుంది. గుమ్మడి గింజలు లో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి ఉంటాయి. అలానే మెగ్నీషియం, ఫాస్ఫరస్, కాపర్, ఐరన్ కూడా ఎక్కువగా ఉంటాయి. గుమ్మడి గింజలు లో జింక్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇది జుట్టు పెరుగుదలకు సహాయం చేస్తుంది. గుమ్మడి గింజలతో నూనెను కూడా తయారు చేసుకోవచ్చు. గుమ్మడి గింజలతో హెయిర్ మాస్క్ కూడా వేసుకోవచ్చు. జుట్టు నిర్మాణాన్ని మెరుగుపరుస్తాయి. ఇలా గుమ్మడి గింజలతో అనేక లాభాలని పొందొచ్చు.