Home » చాణక్య నీతి: ఈ లక్షణాలు లేవంటే… ఎప్పుడూ ఓటమే..!

చాణక్య నీతి: ఈ లక్షణాలు లేవంటే… ఎప్పుడూ ఓటమే..!

by Sravya
Ad

ఆచార్య చాణక్య ఎన్నో విషయాల గురించి ఎంతో చక్కగా వివరించారు. చాణక్య చెప్పినట్లు చేయడం వలన జీవితంలో అంతా మంచే జరుగుతుంది. ఓటమి ఉండదు. ఎవరితో వైరం కూడా ఉండదు. చాణక్య చెప్పినట్లు చేయడం వలన భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ కలహాలు వంటివి కూడా ఉండవు. మంచి అలవాట్ల గురించి, మంచి చేయడం గురించి చాణక్య చెప్పారు. ప్రతి ఒక్కరూ జీవితంలో గెలవాలని అనుకుంటారు. ఓటమితో బాధపడాలని ఎవరు కూడా కోరుకోరు. అయితే ఈ లక్షణాలు ఉంటే, కచ్చితంగా విజయం సాధించవచ్చు అని చాణక్య అన్నారు.

Advertisement

Advertisement

ఇటువంటి లక్షణాలు లేవంటే కచ్చితంగా ఓటమి తప్పదు. ప్రతి మనిషికి కూడా క్రమశిక్షణ ఉండాలి. క్రమశిక్షణ లేకపోతే జీవితంలో విజయాన్ని అందుకోలేడు. ఏకాగ్రత, నిజాయితీ కూడా ప్రతి మనిషికి అవసరం. ఇవి ఉంటే జీవితంలో గెలవచ్చు. నిజాయితీతో ఉంటే ఎలాంటి సమస్యలు రావు. అజాగ్రత్తగా కూడా అసలు ఉండకూడదు. అలానే జ్ఞానమే ప్రతి వ్యక్తికి నిజమైన స్నేహితుడు. పుస్తక జ్ఞానం కలిగి ఉండాలి. లేదు అంటే ఏదైనా పని ద్వారా పొందిన జ్ఞానమైనా సరే ఎప్పుడు వృధా అవ్వదు. ఇటువంటి లక్షణాలని అలవాటు చేసుకున్నట్లయితే కచ్చితంగా జీవితంలో గెలుపు ఉంటుంది లేదంటే ఓటమి తప్పదు.

Also read:

Visitors Are Also Reading