Home » వీళ్ళు ప్రాణం పెట్టి నటించినా డిజాస్టర్స్ తప్పలేదు..!

వీళ్ళు ప్రాణం పెట్టి నటించినా డిజాస్టర్స్ తప్పలేదు..!

by Sravanthi
Ad

ఏ సినిమా హిట్ అవుతుంది..? ఏ సినిమా ఫ్లాప్ అవుతుందని ఎవరూ చెప్పలేరు. ఒక్కోసారి హిట్ అవుతుంది అనే సినిమా ఫ్లాప్ అవ్వచ్చు. ఫ్లాప్ అవుతుంది అన్న సినిమా హిట్ అవ్వచ్చు. కొంతమంది నటులు ప్రాణానికి ప్రాణం పెట్టి కష్టపడిన సినిమాలు కూడా డిజాస్టర్ అయ్యే అవకాశం ఉంది. సినిమా కోసం నటీనటులు ప్రాణం పెట్టి పని చేసిన పరిస్థితులు చాలాసార్లు వస్తూ ఉంటాయి. కొంతమంది అయితే ప్రాణం పోయినా సరే నటించినా పాత్రకు న్యాయం చేయాలి అనుకుంటారు అయితే ఈ హీరోలు ఎంతో కష్టపడి ప్రాణం పెట్టిది పోషించిన సినిమాలు కూడా డిజస్టర్ అయ్యాయి. మరి ఆ సినిమాలకి సంబంధించిన వివరాలను చూద్దాం.

విక్రమ్:

Advertisement

హీరో విక్రమ్ ప్రయోగాలకి కేరాఫ్ అడ్రెస్. ఆయన సినిమా వస్తోందంటే ప్రేక్షకులు కొత్త లుక్ ని ఎక్స్పెక్ట్ చేస్తారు. అపరిచితుడు సినిమా నుండి విజయం అందుకున్నారు. ఐ సినిమా మాత్రం డిజాస్టర్ అయ్యింది. ఎంతో కష్టపడి ఆ పాత్ర పోషించారు. కానీ సినిమా హిట్ అవ్వలేదు. ఈ మూవీలో మూడు పాత్రల కోసం 90 కేజీల బరువు పెరిగాడు. వైరస్ ఇన్ఫెక్షన్ అయిన మరోక పాత్ర కోసం 45 కేజీలు బరువు తగ్గాడు. బీస్ట్ పాత్ర కోసం 120 కేజీల వరకు బరువు పెరిగాడు.

Advertisement

శ్యామ్:

తమిళ్ యాక్టర్ శ్యామ్ ఏకంగా 17 కిలోల తగ్గారు కళ్ళ కింద వాచిపోయి ఉండడం కోసం ఏకంగా 10 రోజులు పాటు నిద్రపోకుండా ఉన్నారట. సినిమా పూర్తయిన తర్వాత వాపు తగ్గి మునిపట్టి లుక్ లోకి వచ్చారట. కానీ సినిమా మాత్రం డిసప్పాయింట్ చేసింది.

అల్లరి నరేష్:

అల్లరి నరేష్ కూడా ఒక రిస్క్ చేశారు లడ్డు బాయ్ సినిమా కోసం ఒక ఫ్యాట్ లుక్ సూట్ రెడీ చేశారు ఈ సూట్ లో ఆయన నటించడం కోసం ఎంతో కష్టపడ్డారు. ఒక ఎక్స్ప్రెషన్ కూడా ఇవ్వలేకపోయారు సరిగ్గా భోజనం కూడా చేయడానికి ఇబ్బంది పడేవారు. ఇంత కష్టపడి చేసినా కూడా సినిమా హిట్ అవ్వలేదు.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading