హీరో అంటే ఎంతో మందికి ఆదర్శం. హీరోలను చూసి అభిమానులను చాలా విషయాలను ఫాలో అవుతుంటారు. కాబట్టి హీరోలు కూడా అభిమానులకు అన్ని విషయాలలో ఆదర్శంగా ఉండాలని అనుకుంటారు. ఈ నేపథ్యంలోనే ఫిట్నెస్ విషయంలోనూ అలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు. అలా టాలీవుడ్ లోని కొంతమంది హీరోలు కూడా ఫిట్నెస్ తో అభిమానులకు ఆదర్శంగా నిలిచారు. ఆ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ యమదొంగ సినిమాకు ముందు బొద్దుగా ఉండేవారు. కానీ యమదొంగ సినిమాలో సన్నగా కనిపించి అందర్నీ అవాక్కయ్యేలా చేశారు. ఆ తరవాత సిక్స్ ప్యాక్ బాడీతో ఫ్యాన్స్ కు ఆదర్శంగా నిలుస్తున్నారు. హీరో శింబు కూడా ఒకప్పుడు బొద్దుగా ఉండేవాడు. కానీ ఇటీవల సినిమాలు సక్సెస్ అవ్వడంతో ఫిట్నెస్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Advertisement
Advertisement
హీరోయిన్ గా అవకాశాలు తగ్గుముఖం పట్టిన తరవాత మీరా జాస్మిన్ బొద్దుగా తయారయ్యారు. కానీ ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆమె సన్నజాజిలా మారిపోయారు. అంతే కాకుండా అల్లువారి హీరో శిరీష్ ఒకప్పుడు బొద్దుగా ఉండేవాడు.కానీ ఇప్పుడు అల్లు శిరీస్ ఫిట్ గా మారడంతో పాటూ సిక్స్ ప్యాక్స్ తో అదరగొడుతున్నాడు.
ఆర్ఆర్ఆర్ సినిమా హీరోయిన్ అలియా భట్ కూడా ఒకప్పుడు బొద్దుగా ఉండేది. కానీ సినిమాల్లోకి వచ్చాక అలియా భట్ నాజుకుగా తయరైంది. హీరోయిన్ ఛార్మీ సినిమాలకు గుడ్ బై చెప్పిన తరవాత బొద్దుగా తయారయ్యింది. కానీ ఇప్పుడు మళ్లీ ఫిట్నెస్ పై దృష్టి పెట్టి నాజుకుగా తయారయ్యింది. యాంకర్ శ్రీముఖి కూడా అప్పట్లో బొద్దుగా తయారయ్యారు. కానీ ఇప్పుడు ఫిట్నెస్ ప దృష్టిపెట్టి మళ్లీ సన్నబడ్డారు.
ALSO READ : Honey Rose : బాలయ్య బ్యూటీ హనీ రోజ్ వయసు ఎంతో తెలుసా.. !