Home » ఈ 7గురు సెల‌బ్రెటీలకు త‌ల్లులు వేరు కానీ తండ్రి ఒక్క‌రే అన్న సంగ‌తి తెలుసా..!

ఈ 7గురు సెల‌బ్రెటీలకు త‌ల్లులు వేరు కానీ తండ్రి ఒక్క‌రే అన్న సంగ‌తి తెలుసా..!

by AJAY
Ad

టాలీవుడ్ లో కొంత‌మంది సెల‌బ్రెటీల తండ్రులు ఒక‌రే అయినా త‌ల్లులు మాత్రం వేరు. అయిన‌ప్ప‌టికీ వారు ఎంతో అన్యోన్యంగా క‌లిసి మెలిసి ఉంటారు. అలా తండ్రి ఒక్క‌రే అయినా వేరే త‌ల్లుల‌ను క‌లిగిన సెల‌బ్రెటీలు ఎవ‌రో ఇప్పుడు తెలుసుకుందాం..

Advertisement

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, క‌ల్యాణ్ రామ్ ఇద్ద‌రూ హ‌రికృష్ణ కుమారులే. అయితే వీరిద్ద‌రి త‌ల్లులు మాత్రం వేరు. కానీ వీరిద్ద‌రూ ఎంతో అన్యోన్యంగా క‌లిసిమెలిసి ఉంటారు.

టాలీవుడ్ సీనియ‌ర్ హీరో న‌రేష్ మ‌రియు ప్రిన్స్ మ‌హేశ్ బాబు ఇద్ద‌రూ హీరో కృష్ణ కుమారులే. అయితే వీరిద్ద‌రి త‌ల్లులు మాత్రం వేరే అయిన‌ప్ప‌టికే వీరిద్ద‌రూ కూడా క‌లిసే ఉంటారు.

Advertisement

అక్కినేని వార‌సులు అఖిల్ నాగ‌చైత‌న్య గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. వీరిద్ద‌రూ నాగార్జున కుమారులే కాగా చైతూ మొద‌టి భార్య ల‌క్ష్మి కుమారుడు అయితే అఖిల్ అమ‌ల కుమారుడు. వీరిద్ద‌రూ కూడా ఒక‌రినొక‌రు ఎంత‌గానో స‌పోర్ట్ చేసుకుంటారు.

డైలాగ్ కింగ్ మోహ‌న్ బాబుకు కూడా ఇద్ద‌రు భార్య‌లు ఉన్నార‌న్న సంగ‌తి చాలా మందికి తెలియ‌దు. అయితే మంచు ల‌క్ష్మి, విష్ణు మోహ‌న్ బాబు మొద‌టి భార్య విద్యాదేవికి జ‌న్మించారు. ఆ త‌ర‌వాత మ‌నోజ్ మోహ‌న్ బాబు రెండో భార్య నిర్మ‌ల దేవికి జ‌న్మించాడు.

అరుణ్ విజ‌య్ మ‌రియు హీరోయిన్ శ్రీదేవిల తండ్రి విజ‌య్ కుమార్ కాగా ఇద్ద‌రి త‌ల్లులు మాత్రం వేరు వేరు.

బోణీక‌పూర్ కు కూడా ఇద్ద‌రు భార్య‌లు ఉన్నారు. ఇక మొదటి భార్య కుమారుడు అర్జున్ క‌పూర్ కాగా శ్రీదేవి కూతురు జాన్వీక‌పూర్.

Visitors Are Also Reading