1KG బరువు తగ్గడానికి నానా హైరానా పడిపోతుంటాం.అలాంటిది ఇప్పుడు చెప్పబోయే సెలెబ్రిటీలు కేజీలకు కేజీల కొవ్వును కరిగించారు. స్కిల్డ్ ట్రైనర్స్, రెగ్యులర్ ఎక్సర్సైజులు, స్ట్రిక్ట్ డైట్ ఇవన్నీ పాటించడం కారణంగానే వారు అంతలా బరువు తగ్గారు. ఫ్యాట్ టు ఫిట్ గా మారిన సెలెబ్రిటీల గురించి ఇప్పుడు చూద్దాం!
అద్నాన్ సమి :
పాపులర్ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ అయిన అద్నాన్ సమీ 16 నెలల్లో 160 కేజీల బరువు తగ్గాడు. మొదట లైపో సక్షన్ చేయించుకున్న అద్నాన్ సమీ తర్వాత డైట్, రెగ్యులర్ ఎక్సర్సైజులు చేస్తూ బరువును కంట్రోల్ చేస్తున్నాడు.
Advertisement
గణేష్ ఆచార్య :
ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్, పుష్పలో ఊ అంటావా అనే సాంగ్ ను కొరియోగ్రఫి చేసింది ఈయనే! ఆచార్య 1.5 సంవత్సరాలు కష్టపడి 85 కేజీల బరువు తగ్గాడు.
Advertisement
అనంత్ అంబానీ :
ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ 18 నెలల్లో 108 కేజీలు తగ్గాడు. రోజూ 21 కిలోమీటర్ల వాకింగ్, 5 గంటల పాటు జిమ్ ఈ ఛేంజోవర్ కి కారణమట! తిండి విషయంలో చాలా కంట్రోల్ చేసుకున్నాడట!
సారా అలీఖాన్ :
సినిమాల్లోకి రాకముందు సారా అలీఖాన్ బరువు 96 కేజీలు. ఇండస్ట్రీలోకి రావాలని భావించి ఏడాది పాటు తీవ్రంగా శ్రమించి 46 కేజీలు తగ్గారు. యోగా, జిమ్ సారా బరువు తగ్గడానికి కారణాలు.