కమెడీయన్ పృధ్వీరాజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి నటుడు. ఇండస్ట్రీలో ఎంతో మంది కమెడీయన్లు ఉన్నా.. కానీ తన కామెడీ టైమింగ్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుందని చెప్పవచ్చు. ఈ కమెడీయన్ ను పృధ్వీరాజ్ అంటే గుర్తుపట్టారు. కానీ 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే తప్పకుండా తనను గుర్తు పట్టేస్తారు. అలాంటి పృధ్వీరాజ్ 1964 ఆగస్టు 06న పశ్చిమగోదావరి జిల్లా తాడెపల్లి గూడెంలో జన్మించారు. తన తండ్రి పేరు బాల్ రెడ్డి సుబ్బారావు. ఆయన రైల్వేలో పార్సిల్ మాస్టర్ గా విధులు నిర్వహించేవారు.
Advertisement
అలా మోహన్ బాబు, సత్యానారయణ, ప్రభాకర్ రెడ్డి వంటి వారితో దాదాపు 60కి పైగా సినిమాలకు నటించారట. అలాగే పృధ్వీకి కూడా నటనపై ఆసక్తి పెరిగింది. అలా పృధ్వీరాజ్ ఇండస్ట్రీలోకి ఎంట్రి ఇచ్చి చాలా సినిమాల్లో నటించారు. 1992లో పృధ్వీరాజ్ ప్రభాకర్ రెడ్డి సలహా మేరకు పీజీ పూర్తి చేశారట. ఇక ఆ తరువాత హోటల్ లో రిసెప్షన్ మేనేజర్ గా కూడా పని చేశారు. ఇక ఆ తరువాత సినిమాలపై ఆసక్తితో సిటీకేబుల్ లో చేరాడు. ఇదే సమయంలో ఈవీవీ సత్యనారాయణ సినిమాల్లో నటులకోసం అన్వేషిస్తున్నారని తెలుసుకొని ఆడిషన్స్ కోసం వెళ్లాడు. అలా ఫస్ట్ టైమ్ ‘ఆ ఒక్కటి అడక్కు’ అనే మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో రావు గోపాలరావు మేనల్లుడిగా సినీ రంగ ప్రవేశం చేశాడు.
Advertisement
అలా ప్రారంభమైన ఆయన సినీ ఇండస్ట్రీ ప్రయాణం అంచలంచెలుగా పెరిగిపోయింది. ఖడ్గం సినిమాలో దర్శకుడు కృష్ణవంశీ సృష్టించిన డైలాగ్.. 30 ఇయర్స్ ఇండస్ట్రీ జనాల్లో చాలా ఫేమస్ అయిపోయింది. దీంతో ఈయన పేరు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీరాజ్ గా మారిపోయింది. ఈ సినిమా నుంచి పృధ్వీరాజ్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. చాలా సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. వచ్చినటువంటి ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇండస్ట్రీలోనే స్టార్ కమెడీయన్ గా ఎదిగారు. పృధ్వీరాజ్ రాజకీయాల్లోకి కూడా ఆరంగేట్రం చేశారు. ఇవాళ పృధ్వీరాజ్ కి జన్మదిన శుభాకాంక్షలు చెబుతోంది మనం న్యూస్. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తోంది మనం టీమ్.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :