Home » ఇండియాలో అత్యంత ధ‌న‌మైన దేవాల‌యాలు ఇవే

ఇండియాలో అత్యంత ధ‌న‌మైన దేవాల‌యాలు ఇవే

by Bunty
Ad

అనంతపద్మనాభస్వామి దేవాలయం తిరువనంతపురం:-
కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉన్న పద్మనాభ స్వామి ఆలయం దేశంలోనే అత్యంత సంపన్న దేవాలయంగా పేరు ఉంది. ఈ ఆలయం గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు కదా. ఒకప్పుడు ఈ ఆలయం తిరువనంతపురం ట్రావెన్కోర్ రాజులు ఏలుబడిలో ఉండేది. కొంతకాలం కిందట ఆలయంలో ఉన్న నేలమాళిగల్లో నిధి ఉన్నట్లు కూడా గుర్తించారు. వాటిలో కొన్ని గదులను తెరవగా వేల కోట్ల విలువచేసే ఆభరణాలు బయటపడ్డాయి. మరొకరికి నాగబంధం ఉండటంతో పండితులు తెరవకూడదు అన్నారు. అందులో అనంత సంపద ఉన్నట్లు అందరూ భావిస్తున్నారు. ఆ సంపద విలువ కనీసం రూ 1.63 లక్షల కోట్ల విలువ ఉంటుందని అంచనా.

Advertisement

 

వైష్ణో దేవి – జమ్మూ కాశ్మీర్ :-

శక్తి పీఠాల్లో అత్యంత శక్తివంతమైన దేవాలయం వైష్ణో దేవి ఆలయం. ఇది జమ్మూ కాశ్మీర్లోని కాట్రా ప్రాంతంలో ఉన్న ఈ దేవాలయానికి దేశ విదేశాల నుంచి ఎంతో మంది భక్తులు వస్తుంటారు. ఏటా వైష్ణోదేవి ఆలయానికి రూ.500 కోట్లు భక్తులు కానుకల రూపంలో అందుతాయి.

సాయిబాబా దేవాలయం- షిరిడి:-

అత్యంత సంపన్న దేవాలయాల్లో మహారాష్ట్రలోని షిరిడీ సాయిబాబా దేవాలయం. ఇక్కడికే హిందువులతో పాటు పలు మతాలకు చెందినవారు కూడా సాయిబాబాను దర్శించుకుంటారు. షిరిడి సాయి సంస్థాన్ ఆధ్వర్యంలో నడిచే ఈ దేవాలయానికి ఏటా రూ.450 కోట్ల ఆదాయం వస్తోంది. తెలుగు ప్రజలు జీవితంలో ఒక్కసారైనా వెళ్లాలి అనుకునే ఆలయాల్లో ఇది కూడా ఒకటి.

Advertisement

వెంకటేశ్వర స్వామి ఆలయం తిరుమల:-

ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఉన్న తిరుమల శ్రీనివాసుని అందరికి తెలిసిందే. ఆ గుడిలో అడుగు పెట్టడంతోనే.. మనసుకు ప్రశాంతంగా.. చుట్టూ గోవింద నామస్మరణతో మార్మోగే ఆ ప్రాంతం మనకు హాయిగా ఆధ్యాత్మిక భావనను కలిగిస్తుంది. ఆలయం దేశంలోనే ఎక్కువ మంది భక్తుల తాకిడి ఉన్న దేవాలయం. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం కోసం నిత్యం సగటున 70 వేల మంది వస్తుంటారు. కలియుగ దైవంగా కొలిచే శ్రీవారికి భక్తులు భారీగానే కానుకలుగా సమర్పిస్తూ ఉంటారు. ప్రస్తుతం కారణంగా భక్తుల సంఖ్య, ఆదాయం తగ్గింది కానీ.. సాధారణంగా ఏటా రూ.650 కోట్ల భక్తులు కానుకల రూపంలో వస్తాయి.

సిద్ధి వినాయక ఆలయం- ముంబై:-

ముంబైలో ఎస్.కె బోలె మార్పు లో ఉన్న సిద్ధి వినాయక ఆలయం చాలా ఫేమస్. ఈ ఆలయంలోనే సిద్ధి వినాయకుడిని దర్శించుకున్న అందుకు సాధారణ ప్రజల నుంచి సినీ, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులందరూ వెళుతుంటారు. అతి సాధారణంగా కనిపించే ఈ ఆలయానికి ఏటా రూ 125 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా.
ఇవే కాకుండా తమిళనాడులోని మీనాక్షి అమ్మన్,ఒడిశాలోని పూరి జగన్నాథ్,గుజరాత్ లోని సోమనాథ్ దేవాలయాలకు కూడా రూ.కోట్లలో ఆదాయం ఉంటుందట.

Visitors Are Also Reading