ఐపీఎల్ 2022 వేలం జరిగింది. అన్నీ జట్లు తమ ప్లేయర్లని ప్రకటించారు. ఇందులో కొన్ని షాకింగ్ నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ రిటైన్ అయిన ప్లేయర్లు జాబితా చూసినట్టయితే.. రిషబ్ పంత్(రూ. 16 కోట్లు), అక్షర్ పటేల్(రూ. 9 కోట్లు), పృథ్వీ షా(రూ. 7.5 కోట్లు), నోర్తెజా(రూ. 6.5 కోట్లు) రిలీజ్ అయిన వాళ్లు శిఖర్ ధావన్, అశ్విన్, స్టోయినిస్, స్టీవ్ స్మిత్, శ్రేయాస్ అయ్యర్ మిగిలిన మొత్తం రూ. 47.5 కోట్లలో మిగతా ఆటగాళ్లను కొనుగోలు చేయనున్నది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ లో రవీంద్ర జడేజా(రూ. 16 కోట్లు), ఎం.ఎస్.ధోని(రూ. 12 కోట్లు), మొయిన్ అలీ(రూ. 8 కోట్లు), రుతురాజ్ గైక్వాడ్(రూ. 6 కోట్లు) రిటైన్ అయ్యారు. సురేష్ రైనా, హర్భజన్ సింగ్, డుప్లెసిస్, ఎంగిడి రివీల్ అయ్యారు. మొత్తం 48 కోట్లు ఉన్నాయి.
Advertisement
రాజస్థాన్ రాయల్స్ టీమ్ లో రిటైన్ అయిన ప్లేయర్స్ సంజూ శాంసన్(రూ. 14 కోట్లు), జోస్ బట్లర్(రూ. 10 కోట్లు), యశస్వి జైస్వాల్(రూ. 4 కోట్లు) ఇక రిలీజ్ అయిన ప్లేయర్స్ జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ మిగిలింది మొత్తం రూ.48 కోట్లు. అదేవిధంగా కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్‌లో ఆండ్రీ రస్సెల్(రూ. 12 కోట్లు), వరుణ్ చక్రవర్తి(రూ. 8 కోట్లు), వెంకటేష్ అయ్యర్(రూ. 8 కోట్లు) సునీల్ నరైన్(రూ. 6 కోట్లు) రిటైన్ అయ్యారు. రిలీజ్ అయిన ప్లేయర్స్ మోర్గాన్, శుభ్‌మన్ గిల్, ప్యాట్ కమ్మిన్స్ ఉండగా.. రూ.48 కోట్లు మిగిలి ఉన్నాయి.
Advertisement
ముంబై ఇండియన్స్ టీమ్‌లో రోహిత్ శర్మ(రూ. 16 కోట్లు), బుమ్రా(రూ. 12 కోట్లు), సూర్యకుమార్ యాదవ్(రూ. 8 కోట్లు), కీరన్ పొలార్డ్(రూ. 6 కోట్లు) రిటైన్ అయ్యారు. హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్య, ఇషాక్ కిషన్, క్వింటన్ డికాక్‌లు రిలీజ్ అయ్యారు. మిగిలినది మొత్తం రూ.48 కోట్లు.. కాగా.. సర్‌రైజర్స్ హైదరాబాద్‌లో కేన్ విలియమ్సన్(రూ. 14 కోట్లు), ఆల్‌రౌండర్ సమద్(రూ. 4 కోట్లు), బౌలర్ ఉమ్రాన్ మాలిక్(రూ. 4 కోట్లు) రిటైనయ్యారు. రిలీజ్ అయిన వారిలో డేవిడ్ వార్నర్, రషీద్‌ఖాన్, భువనేశ్వర్‌కుమార్, నటరాజ్, జానీ బెయిర్‌స్టో ఉన్నారు. మిగిలిన మొత్తం 68 కోట్లు ఉన్నాయి.
Advertisement
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విషయానికొస్తే.. విరాట్ కోహ్లి(రూ. 15 కోట్లు), మ్యాక్స్‌వెల్(రూ.11 కోట్లు), మహమ్మద్ సిరాజ్(రూ. 7 కోట్లు)రిటైన్ అయ్యారు. రిలీజ్ అయిన వారిలో దేవదత్ పడిక్కల్, యుజ్వేంద్ర చాహల్, హర్షల్ పటేల్ ఉన్నారు. మొత్తం రూ.57 కొట్లు ఉన్నాయి. అదేవిధంగా పంజాబ్ కింగ్స్ మయాంక్ అగర్వాల్(రూ. 14 కోట్లు), బౌలర్ అర్షదీప్ సింగ్(రూ. 4 కోట్లు) రిటైన్ చేయగా.. కెఎల్ రాహుల్, క్రిస్ గేల్, మహమ్మద్ షమీ, షారుఖ్ ఖాన్ లు విడుదలయ్యారు. వారి వద్ద మిగిలిన మొత్తం రూ.72 కోట్లు ఉంది.