కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో పాస్‌పోర్ట్‌కు సంబంధించి కీలక ప్రకటన చేసిన విషయం విధితమే. భారత్ లో త్వరలో ఈ-పాస్ పోర్ట్ ప్రారంభించనున్నట్టు మంత్రి ప్రకటించారు. ఇంతకు ఈ-పాస్ పోర్ట్ ఏమిటి..? వీటి ప్రత్యేకతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కొత్త రకం పాస్ పోర్ట్‌లలో ఎంబెడెడ్ చిప్చ్ను ఉపయోగించడంతో పాటు ప్యూచరిస్టిక్ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. ఇందులో మైక్రోచిప్‌లను ఉపయోగిస్తారు. వీటిని ట్యాంపరింగ్, నకిలీవి మార్చడానికి అవకాశం ఉండదు.
Advertisement
Advertisement
ప్రస్తుతం ఇలాంటి ఈ-పాస్ పోర్ట్‌లో అమెరికా, యూకే, జర్మనీతో పాటు పలు అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్నాయి. ఈ కొత్త పాస్ పోర్ట్‌లను నాసిక్ లోని ఇండియా సెక్యూరిటీ ప్రెస్‌లో తయారు చేయనున్నారు.
ఇందులో ఉండే మైక్రోచిప్‌లో పాస్‌పోర్ట్ కలిగిన వ్యక్తి పుట్టిన తేది, పేరుతో పాటు అన్ని వివరాలు నిక్షిప్తమై ఉంటాయి. దీంతో ఇమిగ్రేషన్ కౌంటర్ వద్ద సమయం వృథా కాకుండా నిమిషాల్లో స్కాన్ చేసే అవకాశం లభిస్తుంది. పాస్‌పోర్ట్‌లో ఉండే చిప్‌ను ట్యాంపరింగ్ చేయడానికి అవకాశముండదు. ఎవరైనా నకిలీ పాస్ పోర్ట్‌లను తయారు చేయాలనుకుంటే ఇట్టే దొరికిపోతారు.
Also Reader : విశాల్ ఎఫ్ఐఆర్ ట్రైలర్ విడుదల.. ఎలా ఉందంటే..?