సినిమాల్లో సాధారణంగా ఓ హీరో కోసం కథ రాసుకోవడం ఆ తరువాత ఆ సినిమాను వేరే హీరోతో తెరకెక్కించడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. ముఖ్యంగా ఏ దర్శకుడు అయినా అలా చేస్తారేమో కానీ దర్శకధీరుడు రాజమౌళి ఒక హీరోతో సినిమా చేయాలనుకుంటే ఆ హీరోతోనే సినిమా చేస్తుంటాడు. ఆ హీరోతో సినిమా చేసే ఛాన్స్ రాకపోతే ఆ కథను పక్కకు పెడుతుంటాడు. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళినే పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించారు.
Also Read : ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే కలిగే ప్రయోజనాలు…తెలిస్తే ఒప్పుకోవాల్సిందే…!
Advertisement
ఇటీవల రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో మాత్రం రాజమౌళి ఇలా చేయలేదట. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ మల్టీస్టారర్‌గా ఆర్ఆర్ఆర్ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. కొన్ని పాత్రల్లో అయితే రామ్ చరణ్, ఎన్టీఆర్ తప్ప ఇక మరెవ్వరూ సెట్ కారేమో అన్నంతగా ఈ చిత్రం ఆకట్టుకుంటుంది. ఈ సినిమాకు సంబంధించి వైరల్ అవుతున్న వార్త మాత్రం అభిమానులను షాక్‌కు గురి చేసింది. వాస్తవానికి ఆర్ఆర్ఆర్ కథ రామ్‌చరణ్, ఎన్టీఆర్ లను దృష్టిలో పెట్టుకుని రాసిన కథ కాదట. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ చెప్పడం గమనార్హం.
Advertisement
తొలుత హీరోను ఊహించుకోకుండా కథ రాయాలనుకున్నారట. ఆ తరువాత తమిళ సూపర్‌స్టార్ రజినికాంత్-అర్జున్, ఆ తరువాత సూర్య-కార్తీ ఇలా రెండు జంటలతో సినిమా తీస్తే బాగుంటుంది అని అనుకున్నారట విజయేంద్ర ప్రసాద్. ఇక ఎన్టీఆర్-రామ్‌చరణ్‌లతో తమ ఆలోచన ఆగిపోయిందని పేర్కొన్నారు.
ఈ సినిమాలో వీరిద్దరినీ ఎంచుకోవడానికి ముఖ్య కారణం ఏమిటంటే.. నిజజీవితంలో కూడా వీరిద్దరూ మంచి స్నేహితులు కావడమేనని విజయేంద్రప్రసాద్ చెప్పారు. అలా ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు ఈ సినిమాకు సెలెక్ట్ అయి నటించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల రికార్డు సృస్టిస్తోంది.
Also Read : APRIL 1ST 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!