ఆచార్య చాణక్యుడు భారతదేశ చరిత్రలో నిలిచిపోయిన గొప్ప తత్వవేత్త, సలహాదారుడు, గురువు. ఆచార్య చెప్పిన నీతి ప్రకారం.. భార్య భర్తలు ఒకరినొకరు అన్యోన్యంగా ఉండాలి. వారిలో ఒక్కరూ తప్పుదారి పట్టినా కుటుంబంలో కలతలు ప్రారంభం అవుతాయి. భార్య భర్తల మధ్య పరస్పర సమన్వయం లేకపోతే ఇంట్లో లక్ష్మీదేవికి స్థానముందని అంటారు. భార్యభర్తలు కొన్ని విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అవి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఆచార్య చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం.. భార్యభర్తలు ఒకరికొకరు స్నేహితులుగా ఉండాలి. అదే సమయంలో వారి మధ్య ప్రేమతో పాటు గౌరవం ఉంటే ఆ సంబంధం మరింత అందంగా మారుతుంది. అందుకే ఎల్లప్పుడూ ఒకరికొకరు గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి. ఒకరి అవసరాలను మరొకరు అర్థం చేసుకుంటేనే భార్య భర్తల అనుబంధం బలపడుతుంది.
Advertisement
Advertisement
చాణక్య నీతిలో తెలిపిన దాని ప్రకారం.. భార్య భర్తలు బండికి రెండు చక్రాలు. ఇద్దరూ కలిసి ముందుకు సాగాలి. ఒక చక్రం పాడైతే మరో చక్రం వాహానాన్ని ముందుకు లాగలేదు. ఏదైనా పని పూర్తి కావాలంటే భార్యభర్తలు పోటీగా కాకుండా ఐక్యతతో పని చేయాలి. ఏ విషయంలో కూడా ఒకరిపై ఒకరు అహంకారం చూపకూడదు.
ఎవరైనా విజయవంతమైన వైవాహిక జీవితాన్ని కోరుకుంటే.. భార్య భర్తలిద్దరూ సహనంతో మెలగాలి. అప్పుడే జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ ముందుకు సాగగలుగుతారు. కష్టాల్లో సంయమనం కోల్పోని భార్యభర్తలే జీవితంలో విజయం సాధిస్తారు.
ఆచార్య చాణక్య తన నీతిలో దంపతుల వ్యక్తి గత వివరాలు చాలా రహస్యంగా ఉండాలని చెప్పారు. వారి వ్యక్తి గత విషయాలు మూడవ వ్యక్తికి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుండే భార్య భర్తల బంధంలో కలతలు చోటు చేసుకుంటాయి.
Also Read :
Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ఓర్పు చాలా అవసరం