Home » ఆర్ఆర్ఆర్ కాకుండా బాక్సాఫీస్ ను షేక్ చేసిన 10 సినిమాలు ఇవే..!!

ఆర్ఆర్ఆర్ కాకుండా బాక్సాఫీస్ ను షేక్ చేసిన 10 సినిమాలు ఇవే..!!

by Sravanthi
Ad

ఒక మూవీ దాని రిలీజ్ కు ముందు చేసేటువంటి బిజినెస్ విడుదలైన తర్వాత అది రాబట్టే కలెక్షన్స్ బట్టి సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనేది అంచనాకు వస్తారు. సినిమాకి పెట్టినటువంటి బడ్జెట్ ప్రకారమే నిర్మాతలు థియేట్రికల్ బిజినెస్ హక్కులను అమ్ముకుంటూ ఉంటారు. అయితే కొన్ని సినిమాలు పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి తీసుకురాలేవు. కొన్ని సినిమాలేమో అసలు బిజినెస్ కు మ్యాచ్ కావు. వీటిని ప్లాపులు మరియు డిజాస్టర్ లు అంటాం. కానీ కొన్ని మూవీస్ భారీ లాభాలను తెచ్చి పెట్టి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ క్రియేట్ చేస్తాయి. మరి ఆ సినిమాలు ఏంటో ఒకసారి చూద్దామా..!!బాహుబలి : దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రానికి 116 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ మొత్తం 311. O2 కోట్ల షేరును రాబట్టి, 195 కోట్ల లాభాలు తెచ్చింది.

Advertisement

బాహుబలి 2 : ఇది కూడా ప్రభాస్ మరియు రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం. దీనికి 350 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. 814 కోట్ల షేర్ రాబట్టింది. అంటే 464 కోట్ల రూపాయల లాభం తీసుకువచ్చి చరిత్ర సృష్టించింది.

ఆర్ ఆర్ ఆర్ : ఇది ఎన్టీఆర్ రామ్ చరణ్ మరియు రాజమౌళి కాంబినేషన్ లో రూపొందించిన చిత్రం. 500 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ కలిగింది. కానీ మూవీ ఇప్పటివరకు దాదాపు 700 పైగా కోట్లు షేర్ రాబట్టి, 200 కోట్ల లాభాలను అందించింది.

అల వైకుంఠపురంలో : ఈ మూవీ త్రివిక్రమ్ మరియు అల్లు అర్జున్ కాంబినేషన్ మూవీ. దీనికి 85 కోట్ల రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా మొత్తం 160.37 కోట్ల తో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 75 కోట్ల లాభం అందించింది.

Advertisement

ఎఫ్ 2: వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో వచ్చిన మూవీ ఎఫ్ టు. ఈ మూవీ థియేట్రికల్ 32 కోట్లు బిజినెస్ జరగగా, ఫుల్ రన్ లో మాత్రం 81.05 షేర్ నమోదు చేసింది. మొత్తానికి 49 కోట్ల లాభం అందించింది

గీత గోవిందం : హీరో విజయ్ దేవరకొండ రష్మిక జంటగా నటించిన ఈ సినిమాకి పరశురాం బుజ్జి దర్శకులు. ఈ మూవీ 15కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది.. ఫుల్ రన్ ముగిసేసరికి 71 కోట్ల షేర్ ను వసూలు చేసి, 55 కోట్ల లాభాలను అందించింది.

రంగస్థలం : రామ్ చరణ్ మరియు సుకుమార్ దర్శకత్వంలో చేసిన మూవీ 80.36 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగినది. ఫుల్ రన్ లో ఈ సినిమా 119.45 కోట్ల షేర్లు రాబట్టింది. 39.09 కోట్ల లాభాలు దక్కాయి.

సరిలేరు నీకెవ్వరు :మహేష్ బాబు మరియు అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన చిత్రం 101 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ లో ఈ సినిమా 138.78 కోట్ల షేర్ రాబట్టింది. మొత్తం ఈ మూవీకి 38 కోట్ల రూపాయల లాభాలు అందాయి.

మగధీర: రామ్ చరణ్ మరియు రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీకి 40.42 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసే వరకు ఈ మూవీ 77.96 కోట్ల రూపాయల షేర్ రాబట్టి, 37.54 కోట్ల లాభాలు రాబట్టింది.

సోగ్గాడే చిన్ని నాయన :నాగార్జున హీరోగా ఈ మూవీకి 18 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరగగా, ఫుల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ 47.47 కోట్ల షేర్ రాబట్టి, మొత్తం 28.96 కోట్ల లాభాలు అందించింది.

ALSO READ :

నా మౌనం చేతకాని తనం కాదు…సమంత స్ట్రాంగ్ వార్నింగ్ ఎవరిని ఉద్దేశించి…?

హీరో వేణు గుర్తున్నాడా.. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారో మీకు తెలుసా..!!

 

Visitors Are Also Reading