సాధారణంగా ఎలాంటి శుభకార్యాలు జరగాలన్న మంచి ముహూర్తాలు ఉండాల్సిందే. మంచి ముహుర్తాలు లేకుంటే శుభకార్యాలు చేయరు. ప్రస్తుతం మూఢమి వచ్చేసింది. మూడు నెలల వరకు శుభకార్యాలకు విరామం అనే చెప్పవచ్చు. దీంతో పలు రంగాల వారిపై ప్రభావం పడనుంది. ముఖ్యంగా భాజాభజంత్రీలు, కళ్యాణమండపాల అలంకరణలు, బంధుమిత్రుల రాకపోకలు, కొత్తగా ఇల్లు కట్టుకోవడం, శంకుస్థాపనల హడావుడి ఇలాంటి శ్రావణమాసం చాలా మంచిది.
Advertisement
ఇక భాద్రపద మాసం ప్రారంభం కావడంతో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు నిమజ్జనంతో కొద్ది రోజుల కిందటే ముగిసింది. కొన్ని సంవత్సరాల్లో భాద్రపద మాసం, ఆశ్వీయుజం, కార్తిక మాసంలో కూడా శుభకార్యాలకు ముహుర్తాలుంటాయి. కానీ శ్రావణ మాసం తరువాత అతికొద్ది విరామంలోనే మళ్లీ శుభకార్యాల సందడి మొదలవుతుంది. కానీ ఈ సంవత్సరం శుభకార్యాలకు దాదాపు మూడు నెలల వరకు సుదీర్ఘ విరామం వచ్చింది. ఇందుకు కారణం గురువారం నుంచి శుక్రమౌడ్యమి కావడమే. దీనినే మూఢమి అని పిలుస్తుంటారు. ఇది సెప్టెంబర్ 15, 2022 నుంచి డిసెంబర్ 02, 2022 వరకు అనగా 79 రోజుల పాటు ఉంటుంది. దీంతో ముహుర్తాలకు విరామం ఇచ్చినట్టే అయింది.
Also Read : వెల్లుల్లిని పరగడుపున తేనెలో కలుపుకుని తింటే.. బరువుతో పాటు ఈ 4 సమస్యలు మాయం
సూర్యుడికి శుక్రుడు దగ్గరగా రావడమే కారణం గ్రహ మండలంలో సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతుంటాయి. ఈ తిరిగే క్రమంలో భూమి, సూర్యుడు, ఏదో ఒక గ్రహం ఒకే వరుసలోకి వచ్చినప్పుడు ఆ గ్రహం భూమిపై ఉన్న వారికి కనిపించదు. దీనిని అస్తంగత్వం అని పిలుస్తారు. గ్రహాలకు రాజైన సూర్యుడికి అత్యంత సమీపంలోకి ఏ గ్రహం వచ్చినా అది తన శక్తిని కోల్పోతుంది. అలా బృహస్పతి సూర్యుడి దగ్గరకు వచ్చినప్పుడు గురు మౌడ్యమి, శుక్రుడు సూర్యునికి దగ్గరగా వచ్చినప్పుడు శుక్ర మౌడ్యమిగా పిలుస్తారు. చంద్రుడు, బుధుడు వంటి మిగతా గ్రహాలు కూడా సూర్యునికి ఏదో ఒక సమయంలో దగ్గరగా వస్తున్నప్పటికీ గురువు, శుక్రుడు అలా వచ్చినప్పుడు మాత్రమే జ్యోతిష్యశాస్త్రం దానిని మూఢమిగా పేర్కొంటుంది.
Advertisement
Also Read : మీకు ఈ లక్షణాలు ఉన్నట్లయితే గుండెలో రంద్రం ఉన్నట్టే.. వెంటనే డాక్టర్ని సంప్రదించండి..!
ముఖ్యంగా శుభకార్యాలకు గురు, శుక్ర గ్రహాల బలం ముఖ్యం. ఆ రెండు గ్రహాలు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు వాటి శక్తిని కోల్పోయి బలహీనమవుతాయి. కాబట్టి అలాంటి సమయంలో ఎటువంటి శుభకార్యాలకు పనికి రాదని పంచాగ కర్తలు చెబుతుంటారు. ప్రస్తుతం గురువారం నుంచి శుక్రుడు, సూర్యుడికి దగ్గరగా రావడంతో శుక్రమౌఢ్యమిగా పరిగణిస్తూ.. ఇది వెళ్లేంత వరకు ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు అని పంచాంగాలు నిర్దేశిస్తున్నాయి. చేయకూడనివి, చేసుకోదగిన పనుల విషయాన్ని కూడా జ్యోతిష్యశాస్త్రం, పంచాంగ కర్తలు స్పష్టంగా పేర్కొన్నారు.
అన్నప్రసన్న, భూముల కొనుగోలు, అమ్మకాలు, నూతన వాహనాల కొనుగోలు, నవగ్రహ శాంతులు, జపాలు, హోమాలు,సీమంతం, నామకరణం తదితర కార్యక్రమాలను ఈ మూఢమిలో సైతం మంచి తిథి అనే చెప్పవచ్చు. మంచి తిథి, వార నక్షత్రం ప్రకారం జరుపుకోవచ్చు. నిశ్చితార్థం, వివాహం, పుట్టు వెంట్రుకలు తీయించడం, శంకుస్థాపన, నూతన గృహ ప్రవేశం, ఇల్లు మారడం, ఉపనయనం, విగ్రహ ప్రతిష్ట, వ్రతాలు, బావులు,బోరింగులు, చెరువులు తవ్వించడం, నూతన వ్యాపార ఆరంభం, చెవులు కుట్టించడం వంటివి ఈ మూఢమి సమయంలో చేయకూడదు.
Also Read : ఉదయం బ్రష్ చేయకుండా బ్రేక్ ఫాస్ట్ ఏమవుతుందో తెలుసా..?