Home » వేసవిలో సోరకాయ తీసుకోవడం వల్ల ప్రయోజనాలు ఎన్నో !

వేసవిలో సోరకాయ తీసుకోవడం వల్ల ప్రయోజనాలు ఎన్నో !

by Anji
Ad

సోరకాయలో విటమిస్ సి, సోడియం, ఫైబర్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. సోరకాయ చాలా మందికి బోరింగ్ వెటిటేబుల్ గా కనిపిస్తుంది. కానీ దీనిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. షాక్ అవుతారు. సోరకాయ చల్లదనాన్ని కలిగించడమే కాకుండా ఆరోగ్యంగా ఉండేవిదంగా చేస్తుంది. ప్రతీ సీజన్ లో వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. ప్రస్తుతం వేసవికాలంలో సోరకాయ తినడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.  దీంతో పాటు ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. సోరకాయను రోజు వారి ఆహారంలో చేర్చుకోవచ్చు. చాలా మార్గాలలో సోరకాయను వండుకోవచ్చు. అవి ఏంట ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Also Read :  మామిడి తొక్క వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా ?

Advertisement

ఎండాకాలంలో సోరకాయ తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. వేడిని ఎదుర్కోవడంలో శరీరానికి సహాయపడుతుంది. సోరకాయను క్రమం తప్పకుండా తినడం వల్ల ఒత్తిడి, మానసిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. సోరకాయ మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఔషదం లాంటిది. ఇది చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. సోరకాయ తినడం వల్ల జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుంది. అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్ తదితర సమస్యలు దూరం అవుతాయి. సోరకాయ తినడం వల్ల పేగులు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ ఆహారం పూర్తిగా శరీరానికి అందుతుంది. అనపకాయలో ఐరన్ అధికంగా ఉంటుంది. శరీరంలో హిమోగ్లోబిన్ పెంచడానికి ఉపయోగపడుతుంది.

Advertisement

ఇది తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయి అదుపులో ఉంటుంది. కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు సహజంగా లభిస్తాయి. ఇది ఎముకలను బలోపేతం చేస్తుంది. లూజ్ మోషన్ వంటి సమస్యతో బాదపడుతుంది. పెరుగు లేదా మజ్జిగతో సోరకాయ రైతా తింటే ఈ సమస్యను నియంత్రించవచ్చు. వేసవిలో వేడి, మైకం నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరంలో నీరు లేకపోవడాన్ని నియంత్రిస్తుంది. వడ దెబ్బతగలకుండా చేస్తుంది. లూజ్ మోషన్ సమస్యను నివారిస్తుంది. వేడి కారణంగా శ్వాస ఆడకపోవడం, అలసట ఒత్తిడిని దూరం చేస్తుంది. ఎండ, దూళి, చెమట, అధిక వేడి కారణంగా ఎలాంటి సమస్యలొచ్చినా రోజూ తీసుకునే ఆహారంలో సోరకాయనుచేస్తుకోవడం వల్ల ఈ సమస్యలు అన్నింటి నుంచి బయటపడవచ్చు. సోరకాయతో చేసిన ఏదైనా వంటకాన్ని రోజుకు ఒకసారి అయినా తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read :  అమ‌ల‌ను ప్రేమించ‌డం వ‌ల్లే ఆ స్టార్ విల‌న్ కెరీర్ నాశ‌నం అయ్యిందా..? భ‌య‌ట‌ప‌డిన షాకింగ్ నిజాలు..!

Visitors Are Also Reading