కొత్త కారు కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా.. అయితే ఇదే సరియైన సమయం. కార్ల తయారీ కంపెనీలు భారీ డిస్కౌంట్లు ప్రకటించాయి. ప్రతేడాది లాగానే ఈ ఏడాది కూడా ‘ఇయర్ ఎండ్ సేల్’ ప్రారంభించాయి. ఈ సేల్‌లో భాగంగా ఇప్పటి వరకు అమ్ముడుకాని ఇన్వెంటరీపై భారీ డిస్కౌంట్లతో కార్ల కంపెనీలు కస్టమర్ల ముందుకు వచ్చాయి. మారుతీ సుజుకి దగ్గర్నుంచి, టాటా, హ్యుండాయ్ వరకు మేజర్ కార్ల తయారీ కంపెనీలు తమ హ్యాచ్ బ్యాక్‌లు, సెడాన్లు, ఎస్‌యూవీలపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి. పెట్రోల్ అవతార్‌లో అందుబాటులో ఉన్న రెనాల్ట్ డస్టర్‌పై అత్యధిక మొత్తంలో డిస్కౌంట్లను ఆ కంపెనీ అందిస్తోంది. ఇయర్ ఎండ్ సేల్‌లో భాగంగా ఈ కారుపై రూ.1.30 లక్షల వరకు తగ్గించింది ఆ కంపెనీ. దీనిలో రూ.50 వేల వరకు క్యాష్ డిస్కౌంట్, మరో రూ.50 వేల వరకు ఎక్చేంజ్ బోనస్, రూ.30 వేల వరకు కార్పొరేట్ ప్రయోజనాలున్నాయి.
Advertisement
Advertisement
నిస్సాన్ కిక్స్‌పై కూడా ఆకర్షణీయమైన ఇయర్-ఎండ్ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. దీనిపై రూ.15 వేల వరకు క్యాష్ డిస్కౌంట్, రూ.70 వేల వరకు ఎక్చేంజ్ బోనస్, రూ.10 వేల వరకు కార్పొరేట్ ప్రయోజనాలను ఆ కంపెనీ ఆఫర్ చేస్తోంది. నిస్సాన్ అదనంగా ఆన్‌లైన్ బుకింగ్స్‌పై రూ.5 వేల వరకు డిస్కౌంట్‌ను అందిస్తోంది. 1.5 లీటరు పెట్రోల్ వేరియంట్లతో పోలిస్తే 1.3 లీటరు టర్బో పెట్రోల్ వేరియంట్లకు ఎక్కువ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది ఆ కంపెనీ. అన్ని మహింద్రా ఎస్‌యూవీలతో పోలిస్తే మహింద్రా ఎక్స్‌యూవీ 300పై అత్యధిక డిస్కౌంట్ ఉంది. క్యాష్ డిస్కౌంట్, ఎక్చేంజ్ బోనస్, కార్పొరేట్ ప్రయోజనాలను అన్నింటిన్ని కలుపుకుని ఈ కారుపై రూ.69 వేల వరకు తగ్గించింది ఆ కంపెనీ. ఎక్స్‌యూవీ 300పై రూ.30 వేల వరకు క్యాష్ డిస్కౌంట్, రూ.25 వేల వరకు ఎక్చేంజ్ బోనస్, రూ.4 వేల వరకు కార్పొరేట్ ప్రయోజనాలున్నాయి. అదనంగా రూ.10 వేల వరకు విలువైన యాక్ససరీస్‌లను కంపెనీ ఆఫర్ చేస్తోంది. మొత్తంగా రూ.69 వేల ప్రయోజనాలను ఈ కారుని కొనుగోలు చేస్తే పొందవచ్చు.
మహింద్రా కేయూవీ100 ఎన్ఎక్స్‌టీ అనేది చిన్న ఎస్‌యూవీ. పెట్రోల్ వేరియంట్‌లోనే అందుబాటులో ఉన్న ఈ మోడల్‌పై కంపెనీ మొత్తంగా రూ.61,055 వరకు తగ్గింపును ఇస్తోంది. రూ.38,055 వరకు క్యాష్ డిస్కౌంట్‌ను, రూ.20 వేల వరకు ఎక్చేంజ్ బోనస్‌ను, రూ.3 వేల వరకు కార్పొరేట్ ప్రయోజనాలను కంపెనీ ఆపర్ చేస్తోంది. మారుతీ సుజుకి తన ఎస్-క్రాస్‌పై రూ.45 వేల వరకు ధరను తగ్గించింది. దీనిలో రూ.15 వేల క్యాష్ డిస్కౌంట్, రూ.25 వేల ఎక్చేంజ్ బోనస్, రూ.5 వేల వరకు కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి.ఇయర్ ఎండ్ సేల్‌లో భాగంగా టాటా హారియర్‌పై రూ.65 వేల వరకు ధరను తగ్గించింది ఆ కంపెనీ. డార్క్ వేరియంట్లు మినహా అన్ని వేరియంట్లపై రూ.25 వేల వరకు కార్పొరేట్ డిస్కౌంట్, రూ.40 వేల వరకు ఎక్చేంజ్ డిస్కౌంట్ అందుబాటులో ఉన్నాయి. అయితే డార్క్ వేరియంట్లపై కేవలం రూ.20 వేల ఎక్చేంజ్ డిస్కౌంటే అందుబాటులో ఉంది.