హీరో సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు ఇండస్ట్రీలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. ‘రామదండు’ సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఆ సినిమా అనంతరం కొన్ని సినిమాలలో హీరోగా, నెగటివ్ పాత్రలలో నటించి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నటించిన మెప్పించాడు.
Advertisement
ఇతను సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినవాడే. ఇతని తాత ఓ మంచి కవి, అనేక సినిమాలకు పాటలను కూడా రాశాడు. ఇక సురేష్ వ్యక్తిగత విషయానికి వస్తే అతను సినిమాలలో రాణిస్తున్న సమయంలోనే ఒక అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వారికి ఒక బాబు జన్మించాడు. ఇక కొన్ని రోజులకి వ్యక్తిగత కారణాలవల్ల మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. ఇక సురేష్ రెండవ వివాహం చేసుకున్నాడు. ఆ అమ్మాయి మరెవరో కాదు బుల్లితెర స్టార్ ప్రొడ్యూసర్.
Advertisement
అలాగే పలు సీరియల్స్ లో నటిగా వ్యవహరిస్తోంది. సురేష్ మొదటి భార్యకి పుట్టిన కొడుకు తన తల్లితోనే వెళ్లిపోయాడు. కానీ సురేష్ కి మాత్రం తన కొడుకు అంటే పంచప్రాణాలు. తనకి సమయం దొరికినప్పుడల్లా తన కొడుకుతో సమయాన్ని గడుపుతుంటాడు. ఇక సురేష్ కొడుకు అమెరికాలో ఉంటాడు. తాను కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి అమెరికాలో యాక్టింగ్ స్కూల్లో చేరాడట. ఇక త్వరలోనే సురేష్ కొడుకు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. నిఖిల్ చాలా హ్యాండ్సమ్ గా తన తండ్రి పోలికలతోనే ఉంటాడు. ఇక సురేష్ త్వరలోనే తన వారసత్వాన్ని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాడు.
ఇవి కూడా చదవండి :
Sanju Samson : బాబు కెరీర్ క్లోజ్.. ఇక ఐపీఎల్ ఆడుకో !
Virat Kohli: విరాట్ కోహ్లీ కొత్త ఇల్లు.. ఏకంగా 8 ఎకరాల్లో
హీరోయిన్ శోభన పెళ్లికి దూరమవ్వడానికి ఆ స్టార్ హీరోనే కారణమయా…!