మలయాళ బిగ్ బాస్ కంటెస్టెంట్, మోడల్ బషీర్ బశి మరోసారి తండ్రి అయ్యాడు. బషీర్ రెండో భార్య మశూరా పండంటి మగబిడ్డకి జన్మనిచ్చింది. అయితే ఈ శుభవార్తను అతని మొదటి భార్య సుహానా సోషల్ మీడియాలో షేర్ చేసి.. సంతోషాన్ని వ్యక్తం చేసింది. మశూరాకి బాబు పుట్టాడు. తల్లీబిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారు.
Advertisement
“మీ ఆశీర్వాదాలు మాపై అలాగే ఉంచండి” అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్ కి సుహానా తన కొడుకుని చూసి ఎమోషన్ లైన ఫోటోను కూడా జత చేసింది. ఇది చూసిన సెలబ్రెటీలు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆమె గర్భం దాల్చినప్పటి నుంచి పురిటినొప్పుల దాకా ప్రతిదీ అభిమానులతో చెప్పుకొచ్చింది కుటుంబం. తాజాగా అప్పుడే పుట్టిన బాబును చూపిస్తూ.. యూట్యూబ్ లో వీడియో విడుదల చేయగా అది వైరల్ గా మారింది. మరోవైపు అతని పేరు మీద ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఓపెన్ చేశారు.
Advertisement
Also Read : మెగాస్టార్ చిరంజీవి అల్లుడు మరో వివాహం చేసుకున్నాడా?
ఇకపోతే బషీర్ బిగ్ బాస్ మలయాళం తొలిసీజన్ లో పాల్గొన్నాడు. సూర్య జోడి నెంబర్ 1 అనే ప్రోగ్రామ్ లో తన ఇద్దరూ భార్యలతో కలిసి పార్టిసిపేట్ చేసాడు. బషీర్ 2009లో సుహానాని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరూ పిల్లలున్నారు. 2018లో మశురా ను బషీర్ రెండో పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం రెండో భార్యకి బాబు పుట్టిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Also Read : ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది టాలీవుడ్ స్టార్స్ వీళ్లే..!