Home » ఇప్పటికీ మిస్టరీగానే ఉన్న భక్త ప్రహ్లాద రిలీజ్ డేట్.. ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే..?

ఇప్పటికీ మిస్టరీగానే ఉన్న భక్త ప్రహ్లాద రిలీజ్ డేట్.. ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే..?

by Sravanthi
Ad

మన దేశంలో టాకీల నిర్మాణం ప్రారంభం కాగానే, తెలుగులో కూడా టాకీ చిత్రం రావాలని, తెలుగు సినిమాకు మంచి స్థానం లభించాలని కలలు కన్నా జి. మంగరాజు వాటిని సాకారం చేయడానికి చాలా కృషి చేసారు. ముంబైలో ఉన్న మాణిక్యాలాల్ తో పరిచయం అవడంతో సుదీర్ఘ చర్చలు జరిపి తెలుగు ఇండస్ట్రీలో టాకీ నిర్మాణానికి ముందడుగు వేసేలా చేశారు. ఆ విధంగా హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వంలో నిర్మాణం అయిన తొలి తెలుగు టాకీ 81 ఏళ్ల క్రితం 1932 ఫిబ్రవరి 6తేదీన విడుదల అయింది. భారతీయ తొలి టాకీ “ఆలం ఆరా” విడుదలైన ఆరు నెలలకు 1931 సెప్టెంబర్ 15 భక్త ప్రహ్లాద విడుదలైన మాట వాస్తవం కాదని, 1932 జనవరి 22న సెన్సార్ పూర్తి చేసుకుని ఫిబ్రవరి 6వ తేదీన ఈ సినిమా విడుదలైంది.

Advertisement

ALSO READ:అభిమానుల‌కు శుభ‌వార్త చెప్పిన సింగ‌ర్ సునీత‌.. అది వింటే సంతోష‌ప‌డ‌డం ప‌క్కా..!

ఆధారాలతో సహా పాత్రికేయుడు రెంటాల జయదేవ్ నిరూపించిన సంగతి చాలా మందికి తెలిసిన విషయమే. ఇక మరో విషయం ఏంటంటే ఈ సినిమా తొలిసారిగా విడుదలైంది. అప్పటికే ఆంధ్రులు పెద్ద సంఖ్యలో ఉన్న ముంబైలో సెన్సార్ అయిన మరుసటి వారమే తెలుగులో మాటలు, పాటలు ఉన్న భారత్ మూవీటోన్ వారి భక్తిరస చిత్రం భక్త ప్రహ్లాద త్వరలో విడుదల కానుంది అని 1932 జనవరి 31న ది బొంబాయి క్రానికల్ లో వచ్చింది. ఆ ప్రకటన వచ్చిన వారం లోపల ముంబై లో తొలిసారి భక్త ప్రహ్లాద చిత్రం విడుదలైంది. ఇక ప్రివ్యూ చూడటం వల్ల ఆ రోజుకి వచ్చేలా కొన్ని దినపత్రికలు సమీక్షలు రాశాయి. 1932 ఫిబ్రవరి 6 వ తేదీన ది టైమ్స్ ఆఫ్ ఇండియా దినపత్రికలో కూడా భక్త ప్రహ్లాద రివ్యూ వచ్చింది.

Advertisement

జయదేవ పరిశోధన వివరాల ప్రకారం ఈ సినిమా చెన్నై లో విడుదల కావడానికి మరో రెండు నెలలు పట్టింది.1932 ఏప్రిల్ 2 శనివారం నేషనల్ పిక్చర్ ప్యాలెస్ టాకీస్ లో విడుదలై రెండు వారాలు ఆడింది. అప్పటి మన ఉమ్మడి మద్రాసు రాష్ట్ర రాజధాని చెన్నపట్నం వచ్చే లోపల భక్త ప్రహ్లాద ఇంకా ఎక్కడ ఎక్కడ ఆడిందో ఆధారాలు లేవుకాని రాజమహేంద్రవరం నందు మూడు వారాల వరకు ప్రజలను ఆకర్షించింది. ఆంధ్ర దినపత్రిక 1932 ఏప్రిల్ 2 పేజి నెంబర్ 14 లో అనే వాక్యం ఒకటే మనకు తెలుసు. ఈ ఒక్క వాక్యం మినహా తెలుగునేలపై ఏ ప్రాంతాల్లో ఏ తేదీల్లో ఈ తొలి తెలుగు టాకీ ప్రదర్శించబడిందో తెలిపే సాక్ష్యాలు దురదృష్టవశాత్తు ఇప్పటికీ తెలియరాలేదు. దీంతో ఇప్పటికీ ఈ సినిమా విడుదల తేదీపై పరిశోధన జరుగుతూనే ఉన్నాయి.

ALSO READ:ప్ర‌ముఖ న‌టుడు అజ‌య్ ఘోష్ ఒక్క రోజుకి పారితోషికం ఎంత తీసుకుంటాడో తెలుసా..?

Visitors Are Also Reading