Home » ప్ర‌ముఖ న‌టుడు అజ‌య్ ఘోష్ ఒక్క రోజుకి పారితోషికం ఎంత తీసుకుంటాడో తెలుసా..?

ప్ర‌ముఖ న‌టుడు అజ‌య్ ఘోష్ ఒక్క రోజుకి పారితోషికం ఎంత తీసుకుంటాడో తెలుసా..?

by Anji
Ad

ప్ర‌ముఖ న‌టుడు అజ‌య్ ఘోష్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఆయ‌న చాలా సినిమాల్లో న‌టించి ఓ ప్ర‌త్యేక గుర్తింపు ద‌క్కిచుకున్నాడు. ఇక ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబలి2 సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యాన్ని సంపాదించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఈ సినిమా సాధించిన రికార్డుల్లో మెజారిటీ రికార్డుల‌కు ఏ సినిమా క్రియేట్ లేద‌నే చెప్పాలి. అయితే ఈ సినిమా గురించి న‌టుడు అజ‌య్ ఘోష్ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడారు.

ఇవి కూడా చ‌ద‌వండి :  అభిమానుల‌కు శుభ‌వార్త చెప్పిన సింగ‌ర్ సునీత‌.. అది వింటే సంతోష‌ప‌డ‌డం ప‌క్కా..!

Advertisement

ఇక ఈ ఇంట‌ర్వ్యూలో కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించారు అజ‌య్ ఘోష్జ‌. అందులో ముఖ్యంగా బాహుబ‌లి 2 సినిమాలో అనుష్కకి నాకు ఓ ఫైట్ సీన్ ఉంటుంద‌ని.. సీన్ లీక్ కావ‌డం ఎడిటింగ్ వ‌ల్ల నా సీన్లు పోయాయ‌ని చెప్పారు. నిర్మాత‌లు బ‌తికితే మాత్ర‌మే సినిమా స్థాయి పెరుగుతుంద‌ని చెప్పుకొచ్చారు. ఇక కొంత మంది క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులు త‌మ రేంజ్‌ని చూపించుకోవ‌డం కోసం అసిస్టెంట్ల‌ను పెట్టుకుంటార‌ని వెల్ల‌డించారు. కొంత‌మంది ప్ర‌వ‌ర్త‌న ఇబ్బందిక‌రంగా ఉంటుంద‌ని అజ‌య్ ఘోష్ కామెంట్లు చేయ‌డం విశేషం. ప్ర‌ధానంగా నేను అంటే ఏంటో నాకు తెలుసు అని.. నా నుంచి ద‌ర్శ‌క నిర్మాత‌లు ఏం కోరుకుంటున్నారో అదే చేస్తాన‌ని చెప్పుకొచ్చారు.

Advertisement


ఇక పుష్ప సినిమా త‌రువాత ఇత‌ర భాష‌ల సినీ నిర్మాత‌ల నుంచి కాల్స్ ఇచ్చాయ‌ని తెలిపారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ఓ క‌థ చెప్పార‌ని.. ఆ సినిమాలో నేను ఉంటానో లేదో మాత్రం తెలియ‌దు అని చెప్పుకొచ్చారు. ఎవ‌రు ఏ ప‌ని చేసే స‌మ‌యంలో వారికి ఆ ధోర‌ణి ఉంటుంద‌ని.. బిజినెస్ చేసే స‌మ‌యంలో బిజినెస్ ధోర‌ణి ఉంటుంద‌ని కామెంట్స్ చేశారు. ముఖ్యంగా నేను వ్య‌క్తిత్వాన్ని చంపుకొని అస‌లు ప‌ని చేయ‌ను అని అజ‌య్ ఘోష్ పేర్కొన్నారు. ఇటీవ‌ల ఓ పెద్ద సినిమాను ప‌ని చేశాన‌ని.. అయితే ఆరు రోజుల‌కు ఆరు ల‌క్ష‌ల రూపాయ‌లు వ‌స్తాయని అనుకున్న స‌మ‌యంలోనే మూడు రోజుల్లో నా పార్ట్ షూటింగ్ పూర్త‌వ్వ‌డంతో కేవ‌లం మూడు ల‌క్ష‌లు ఇచ్చారు అని చెప్పారు. రోజుకు ల‌క్ష రూపాయ‌లు పారితోషికం తీసుకున్న‌ట్టు చెప్పుకొచ్చాడు అజ‌య్ ఘోష్‌. ఇక అజ‌య్ ఘోష్ వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి.

 

ఇవి కూడా చ‌ద‌వండి :  హర్రర్ సినిమాలో ప్రభాస్ చేయబోతున్నాడా..?

Visitors Are Also Reading