భారతీయ ప్రముఖ వ్యాపార వేత్త రతన్ టాటాకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయన ఇటీవలే తన 84 బర్త్ డే వేడుకలను జరుపుకున్నారు. ఈసారి ఆయన పుట్టిన రోజు చాలా ప్రత్యేకంగా జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన తన స్నేహితున్ని ప్రపంచానికి పరిచయం చేశారు. మీరంతా రతన్ టాటా స్నేహితుడు అంటే ఎంత పెద్ద వ్యాపారవేత్త అని అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. ఆయన స్నేహితుడి వయసు కేవలం 28 సంవత్సరాలు.. అతని పేరే శాంతను నాయుడు.. ఈ యువకుడు రతన్ టాటా భుజంపై చేయి వేసి మరి ఫోటో దిగాడు.. అయితే ఈ ఫోటోలు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నయి.. అసలు ఈ కుర్రాడు ఎవరు అంటూ నెటిజన్స్ ఆరా తీస్తున్నారు.. మరి ఆ కుర్రాడు ఎవరో ఓ సారి చూద్దాం..శాంతను నాయుడు టాటా సంస్థలో ఒక ఉద్యోగి. 2014లో ముంబైలోని టాటా కంపెనీ లో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ గా చేరారు. ఒక రోజు రోడ్డు ప్రమాదంలో ఒక శునకం మరణించడం శాంతానును బాధపెట్టిందట..
Advertisement
ALSO READ:లైగర్ మూవీ ఫ్లాప్ అయితే అని జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు విజయ్ సమాధానం ఏంటో తెలుసా..?
ఆ ప్రాంతం అంతా రక్తంతో నిండడంతో ఆయన మనసు కరిగిపోయిందట. మరోసారి ఇలా వీధికుక్కలు చనిపోవడం జరగకూడదు అనుకున్నారు.. దీంతో వీధిలో తిరిగే కుక్కలను ప్రమాదం నుంచి తప్పించడం కోసం ఒక కార్యక్రమాన్ని చేపట్టాడు. ఈ సందర్భంగా తన స్నేహితులతో కలిసి గ్లో ఇన్ ది డాగ్ కలర్ అని పిలిచే డాగ్ కాలర్ ని సృష్టించాడు. ఇలా వీధి కుక్కల మెడలో రాత్రిపూట మెరిసే కలర్స్ ను వేయడంతో వాహనాల డ్రైవర్స్ సుదూరంగా ఉన్న కుక్కలను గుర్తించి ప్రమాదం నుంచి తప్పించవచ్చు. కానీ ఈ కార్యక్రమం నిర్వహించడానికి తన దగ్గర డబ్బు లేకపోవడంతో ఈ కార్యక్రమాన్ని కొద్దిరోజులు నిర్వహించి తరువాత విరమించుకున్నారని రతన్ టాటాకు లేఖ రాశారు. ఈ లేఖను అందుకున్న టాటా వెంటనే స్పందించారు. కొద్దిరోజుల తర్వాత అతన్ని ఒక సమావేశానికి రమ్మని ఆహ్వానించారు.
Advertisement
శాంతాను లేఖ నన్ను తీవ్రంగా కలచి వేసిందని రతన్ టాటా ఒక సందర్భంలో తెలియజేశారు. దీంతో గ్లో ఇన్ ది డాగ్ కాలర్స్ కార్యక్రమాన్ని చేపట్టేందుకు నిధులు సమకూర్చారు. అలా వీరిద్దరి మధ్య స్నేహం బలపడింది. కానీ ఇంతలో శాంతాను యూఎస్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడానికి వెళ్లాల్సి వచ్చింది. దీంతో కొద్ది రోజులు అతనితో కలిసి ఉన్న శాంతను అలా విడిచి వెళ్లడంతో రతన్ టాటా బాధ పడ్డారట. కానీ తాను చదివిన యూనివర్సిటీలోనే ఆయన చదవడం చూసి ఆనంద పడ్డారు. అలా యూఎస్ లో చదువు పూర్తి చేసుకున్న శాంతను మళ్లీ భారతదేశానికి వచ్చారు. మళ్లీ శాంతను తమ సంస్థలో పని చేయాలని రతన్ టాటా ఆహ్వానించడంతో అంత పెద్ద వ్యాపారవేత్త అడిగానని శాంతాను వెంటనే ఒప్పేసుకున్నారు. ఈ విధంగా శాంతను చేసే పనికి మెచ్చి రతన్ టాటా తనకు సహాయకుడిగా ఉండాలని ప్రత్యేకంగా నియమించుకున్నారు. ఈ విధంగా ఇద్దరి మధ్య చాలా సాన్నిహిత్యం పెరిగి పోయింది.
ALSO READ: