Home » వామ్మో కిలో ఉప్పు ధ‌ర రూ. 30 వేలు! ఎక్కుడో తెలుసా?

వామ్మో కిలో ఉప్పు ధ‌ర రూ. 30 వేలు! ఎక్కుడో తెలుసా?

by Bunty
Ad

సాధార‌ణం గా కిలో గ్రాము ఉప్పు ధ‌ర రూ. 16 వ‌ర‌కు ఉంటుంది. ఇంకా మంచి బ్రాండ్ కావాలంటే.. రూ. 20 నుంచి 30 వ‌ర‌కు ఉంటుంది. కానీ ఆ దేశం లో మాత్రం ఈ ఉప్పు ధ‌ర వింటేనే గుండె పోటు వ‌చ్చేస్తేంది. ఒక కిలో గ్రాము ఉప్పు ధ‌ర అక్ష‌రాల రూ. 30,000. ఈ ఉప్పునే బాంబూ ఉప్పు అంటారు. ఈ ఉప్పు కు అంత ధ‌ర ఎందుకు.. ఎమిటా ప్ర‌త్యేక‌త అని డౌట్ అంద‌రికి వ‌స్తుంది. ఇప్పుడు మ‌నం బాంబూ ఉప్పు అంటే ఎమిటి.. దానికి ఎంత ధ‌ర ఎందుకు.. దాని ప్రత్యేక‌త‌లు ఎమిటి.. ఈ ఉప్పు ఎక్కుడ ఉంటుంది.. అనే ప్ర‌శ్నాలు స‌మాధానం చూద్దం.

Advertisement

Advertisement

బాంబూ సాల్ట్ అనేది కొరియ‌న్ దేశాల లో ఎక్కువ గా వాడుతుంటారు. ఈ ఉప్పు సాధార‌ణ ఉప్పు నుంచే త‌యారు చేస్తారు. కానీ ఈ సాల్ట్ ను బాగా వేడి చేస్తే వ‌చ్చేదే బాంబూ సాల్ట్. బాగా అంటే.. సాధార‌ణ ఉప్పును వెదురు బొంగుల‌లో ఉంచి దాదాపు 800 డిగ్రీ ల‌కు పై గా రోస్ట్ చేయాలి. పైన ఉన్న వెదురు బొంగు ను పూర్తి గా కాలేలా రోస్టు చేస్తారు.

ఈ ప్ర‌క్రియ ను 9 సార్లు చేస్తారు. ఇలా చేయ‌డం తో బాంబూ సాల్ట్ సిద్దం అవుతుంది. అయితే ఇలా ఎక్కువ ఉష్ణోగ్ర‌త వ‌ద్ద ఎక్కువ సార్లు కాల్చ‌డం వ‌ల్ల వెదురు బొంగు రంస అంతా సాల్ట్ కు ప‌ట్టుకుంటుంది. దీంతో సాల్ట్ బాంబూ సాల్ట్ గా మారుతుంది. ఇలా తయారు అయిన బాంబూ సాల్ట్ ఆరోగ్యానికి మంచిద‌ని.. రోగ నిరోద‌క శ‌క్తి ని పెంచుతుంద‌ని కొరియ‌న్లు న‌మ్ముతారు. అలాగే కొరియ‌న్లు ఈ బంబూ సాల్ట్ ను వైద్యం లో కూడా వాడుతారు.

Visitors Are Also Reading